Share News

Jaya Nageswara Reddy Fires on Jagan: తల్లి, చెల్లికి ద్రోహం చేసిన జగనే బావిలో దుకాలి.. బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఫైర్

ABN , Publish Date - Sep 12 , 2025 | 02:44 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లికి ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డినే బావిలో దుకాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Jaya Nageswara Reddy Fires on Jagan: తల్లి, చెల్లికి ద్రోహం చేసిన జగనే బావిలో దుకాలి.. బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఫైర్
BV Jaya Nageswara Reddy Fires on Jagan

కర్నూల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి (BV Jaya Nageswara Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లికి ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డినే బావిలో దుకాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ వారసుడు జగన్ కాదని, తన కొడుకు అని షర్మిల చెబుతున్నారని గుర్తుచేశారు. షర్మిల వ్యాఖ్యలకు ఇప్పుడు జగన్ ఎక్కడ మొహం పెట్టుకుంటారని సెటైర్లు గుప్పించారు బీవీ జయ నాగేశ్వరరెడ్డి.


ఇవాళ(శుక్రవారం) కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో బీవీ జయ నాగేశ్వరరెడ్డి మాట్లాడారు. రైతులు యూరియా కోసం క్యూ లైన్‌లో నిలబడితే దానిని వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ నేత బుట్టా రేణుక ప్రభుత్వ ఆస్పత్రిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బుట్టా రేణుక తన రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ అండ్ కో కూటమి ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలే తగిన బుద్ది చెబుతారని బీవీ జయ నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 12 , 2025 | 03:17 PM