Share News

Satyakumar Comments on Diarrhea: డయేరియాపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:22 PM

డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

Satyakumar Comments on Diarrhea: డయేరియాపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
Satyakumar Comments on Diarrhea

విజయవాడ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): డయేరియాపై (Diarrhea Cases) ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రస్తుతం డయేరియా పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర పర్యటించారు. మెడికల్ క్యాంపులో రోగులతో మంత్రులు సత్యకుమార్, నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు. అనంతరం మీడియాతో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు.


తాగునీటి పైపులైన్, అండర్ గ్రౌండ్ వాటర్‌ను పరీక్షలకు పంపామని వెల్లడించారు. నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా తాగునీటి సరఫరా నిలిపి వేశామని చెప్పుకొచ్చారు. బయట నుంచి మినరల్ వాటర్ క్యాన్లతో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలతో కూడా మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నామని అన్నారు. ఇంటింటికీ వెళ్లి మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లు ఇచ్చామని తెలిపారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో 141 మంది డయేరియా (Diarrhea Cases) బారిన పడ్డారని చెప్పుకొచ్చారు. డయేరియా బారిన పడ్డా అందరికీ చికిత్స చేశామని.. ఇప్పుడు 68 మందికి చికిత్స జరుగుతోందని తెలిపారు మంత్రి సత్యకుమార్ యాదవ్.


డయేరియా వల్ల ఎవరూ చనిపోలేదని.. వదంతలు నమ్మొద్దని పేర్కొన్నారు. డయేరియా వచ్చిన వారు పలు రకాల కారణాలు చెబుతున్నారని తెలిపారు. పానీపూరీ తిన్నారని, నీళ్లు అని, వంకాయ, ఎండుచేప కూర తినడం వల్ల డయేరియా వచ్చిందని వారు అంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ రిపోర్టులో కూడా నెగిటివ్ వచ్చిందని.. రెండో విడుత కూడా ల్యాబ్‌కు పంపామని వెల్లడించారు. బుడమేరు ప్రాంతం‌ కాబట్టి.. భూగర్బ జలాలు కలుషితం అయ్యాయనే కోణంలో పరిశీలన జరుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


అధికారులు వేగంగా స్పందించారు: ఎంపీ కేశినేని శివనాథ్

డయేరియా ప్రబలిన వెంటనే అధికారులు వేగంగా స్పందించారని ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Shivanath) తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకుని ప్రజలకు వైద్య సేవలు అందించారని అన్నారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్‌లు ఇక్కడకు వచ్చి ప్రజలతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇక్కడ చేపట్టాల్సిన చర్యలపై ఎమ్యెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తాను ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 12 , 2025 | 01:34 PM