Kollu Ravindra Fires on Jagan: అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:53 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లల్లో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్‌ను ఇంట్లో కూర్చో పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
విజయవాడ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లల్లో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్‌ను ఇంట్లో కూర్చో పెట్టారని విమర్శించారు. సూపర్ సిక్స్ సభ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.
ప్రజల కోసం తిరిగే నాయకుడు చంద్రబాబు అని ఉద్ఘాటించారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.
నేపాల్‌లో జరిగిన దాడులు చాలా భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వారి కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేసి రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ చిక్కుకున్న ఏపీ వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది అని గుర్తుచేశారు. గతంలో విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాడిపత్రిలో హై టెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నా పోలీసులు
Read Latest Andhra Pradesh News and National News