Share News

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. కోర్టు ముందుకు నిందితులు

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:47 PM

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను‌ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. ఈ క్రమంలో లిక్కర్‌ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. కోర్టు ముందుకు నిందితులు
AP Liquor Scam Case

విజయవాడ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో (AP Liquor Scam Case) నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను‌ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. లిక్కర్‌ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.


అయితే, ఏసీబీ కోర్టుకు (ACB Court) తీసుకువచ్చిన వారిలో.. విజయవాడ జైలు నుంచి రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడు, గుంటూరు జైలు నుంచి నిందితులు నవీన్, బాలాజీ కుమార్‌తో పాటు.. రాజమండ్రి జైలు నుంచి మిథున్‌రెడ్డిని కూడా ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. అయితే, బెయిల్‌పై పైలా దిలీప్‌, డిఫాల్ట్‌ బెయిల్‌పై ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బయట ఉన్నారు. వీరు కూడా ఇవాళ (శుక్రవారం) న్యాయస్థానంలో జరిగిన విచారణకు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 12 , 2025 | 01:03 PM