Share News

ZPTC Elections: పులివెందుల ఎన్నికల ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ

ABN , Publish Date - Aug 14 , 2025 | 07:23 AM

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.

ZPTC Elections: పులివెందుల ఎన్నికల ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ
Pulivendula ZPTC Bye Election Counting

» పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

» ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు

» కౌంటింగ్‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ?

» పారదర్శకంగా కౌంటింగ్ చేపట్టాలి

» సిబ్బందికి శిక్షణలో జేసీ అదితిసింగ్

కడప కలెక్టరేట్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ (ZPTC Bye Election Counting) పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ (Aditi Singh) ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. పులివెందుల ఉపఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి 10 టేబుళ్లు, 1 రౌండ్లో ఫలితాలు లెక్కిస్తామని తెలిపారు. అలాగే ఒంటిమిట్ట ఉపఎన్నికలకు 10 టేబుళ్లు, 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. ఒక్కో టేబుల్‌కు ఓ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున సూపర్‌వైజర్ర్లు 30 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, స్టాటికల్ అధికారులు ముగ్గురు ఇతర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది ఉంటారని పేర్కొన్నారు. అందరూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జడ్పీ సీఈవో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఓబులమ్మ, ఏఆర్వోలు రంగస్వామి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడి కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా ఈ ఎన్నికలు నువ్వా నేనే అనేలా జరగడంతో వీటి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పులివెందుల ఉప ఎన్నికల్లో గెలుపుపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ గెలుపు టీడీపీకి దాదాపు ఖరారైనప్పటికీ అధికారిక ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా... పులివెందులలో మంగళవారం చేపట్టిన పోలింగ్‌లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తిరిగి 3, 14వ పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ నిర్వహించింది. ఈ రెండు చోట్లా ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. అచ్చవెల్లి పోలింగ్ కేంద్రం (3)లో 492 ఓట్లు ఉంటే 337 ఓట్లు పోల్ అయ్యాయి. 68.50 శాతం మంది ఓట్లు వినియోగించుకున్నారు. ఇక ఈ కొత్తపల్లె పోలింగ్ కేంద్రం(14)లో 1,273 ఓట్లు ఉంటే 691 ఓట్లు పోల్ అయ్యాయి. 54.28 శాతం మంది ఓట్లు వేశారు.


వైసీపీ బాయ్ కాట్.?

జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ని వైసీపీ బాయికాట్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగలేదంటూ ఇప్పటికీ వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. కౌంటింగ్‌ని కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కౌంటింగ్‌ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. ఇక పులివెందులలో బుధవారం జరిగిన రీ పోలింగు‌ని‌ వైసీపీ బహిష్కరించింది. అయితే కౌంటింగ్‌ని బాయికాట్ చేస్తున్నట్లు అధికారికంగా ఆ పార్టీ ప్రకటించలేదు. అధికార యంత్రాంగం కౌంటింగ్‌కి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


రీ పోలింగు బహిష్కరించాం : ఎంపీ

పులివెందుల రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీ పోలింగ్‌ని బహిష్కరించామని కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంగళవారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ చూస్తే టీడీపీ ఒక కొత్త సంస్కృతికి నాంది పలికిందని చెప్పుకొచ్చారు. 15 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల మధ్య రీపోలింగ్ నిర్వహించాలని తాము డిమాండ్ చేశామని పేర్కొన్నారు. కానీ కంటితుడుపు చర్యగా కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టారని మండిపడ్డారు. దీంతో తాము రీపోలింగ్‌ని బహిష్కరించామని తెలిపారు.


8 గంటల నుంచి లెక్కింపు

రెండు జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి 11 మంది, ఒంటిమిట్ట నుంచి 11 మంది పోటీ చేశారు. వీటికి సంబంధించి నగర శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బ్యాలెట్ బాక్సులను ఇక్కడి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. గురువారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. పులివెందులకు సంబంధించి ఒక రౌండులో పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టకు సంబంధించి మూడు రౌండ్లు, పదిటేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబులుకు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. అంటే సుమారు వంద మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు.


ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్‌లు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలోని కౌంటింగ్ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 08:13 AM