Share News

Jagan Property Dispute: జగన్ ఆస్తుల వివాదంలో ఊహించని మలుపు

ABN , Publish Date - Oct 14 , 2025 | 08:09 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నై లోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సవాల్ చేశారు.

Jagan Property Dispute: జగన్ ఆస్తుల వివాదంలో ఊహించని మలుపు
Jagan Property Dispute

అమరావతి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి చెందిన సరస్వతి పవర్ షేర్ల (Saraswati Power Shares) బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నైలోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో జగన్ తల్లి విజయలక్ష్మి (Vijayalakshmi), చెల్లి షర్మిల (Sharmila) సవాల్ చేశారు.


జగన్ తల్లి, చెల్లెలు పేరిట రాసిన గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల షేర్ల బదిలీ చెల్లదని, అవన్నీ జగన్ వద్దే ఉన్నాయని హైదరాబాద్ NCLT తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో NCLT తీర్పును చెన్నై ట్రిబ్యునల్‌లో సవాల్ చేశారు విజయలక్ష్మి, షర్మిల. ఈ రోజు (మంగళవారం) చెన్నై ట్రిబ్యునల్‌లో దీనిపై విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం హైదరాబాద్ NCLT ఇచ్చిన ఉత్తర్వులపై స్టేటస్ కో విధించింది చెన్నై ట్రిబ్యునల్.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 08:18 PM