Minister Nara Lokesh: ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్.. అధికారులకి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 09:52 PM
ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్.
అమరావతి, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యపై ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్. యూనివర్సిటీలకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్‌ను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు మంత్రి లోకేష్.
ఉన్నత విద్యలో పాఠ్యప్రణాళిక ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీఐలు, యూనివర్సిటీలను నవంబరులోగా పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా రూపొందించాలని ఆజ్ఞాపించారు. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో వందశాతం ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు మంత్రి లోకేష్.
ఈనెల 27వ తేదీన సింగపూర్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు వెళ్తారని స్పష్టం చేశారు. డిసెంబర్ 5వ తేదీన మెగా పీటీఎంకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలల్లో పరిశీలనకు డీఈఓలు, ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News