CM Chandrababu: ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడింది.. సీఎం చంద్రబాబు కితాబు
ABN , Publish Date - Dec 06 , 2025 | 08:09 PM
ప్రతీ ఒక్కరి పనితీరుపైనా నాలుగైదు మార్గాల్లో కచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాంటి పదవులూ ఆలోచించకుండా నిస్వార్థంగా పనిచేస్తోందని ప్రస్తావించారు. అదే తరహాలో మన ఐడియాలజీ ప్రకారం పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.
అమరావతి, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): పలు కీలక సమీక్షలు, వన్ టు వన్ భేటీల ద్వారా దాదాపు అందరి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రశంసించారు. మరో 37మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని తెలిపారు. ఇవాళ (శనివారం) అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
ప్రతీ ఒక్కరి పనితీరుపైనా నాలుగైదు మార్గాల్లో కచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఆర్ఎస్ఎస్ ఎలాంటి పదవులూ ఆలోచించకుండా బీజేపీకి నిస్వార్థంగా పనిచేస్తోందని ప్రస్తావించారు. అదే తరహాలో మన ఐడియాలజీ ప్రకారం పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. స్కూల్ ఇన్నోవేటివ్ పార్టనర్‌షిప్ సమ్మిట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడదామని సూచించారు సీఎం చంద్రబాబు.
విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిద్దామని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు గంటలపాటు మీడియా సమావేశం పెట్టిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు నేతలు. నెలకోసారి వచ్చి విజ్ఞత కోల్పోయి మాట్లాడేవారి మాటలకు విలువ లేదని ఎద్దేవా చేశారు. ప్రజలే వారికి బుద్ది చెబుతారని తెలిపారు. జగన్ మాట్లాడే అర్థం పర్థం లేని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News