Share News

Nimmala Ramanayudu VS YSRCP: అబద్ధాలతో అమరావతిని ముంచాలన్న వైసీపీ యత్నం విఫలం: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Aug 22 , 2025 | 06:03 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని లేపడానికి, పొన్నూరును ముంచేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయని విమర్శించారు.

Nimmala Ramanayudu VS YSRCP: అబద్ధాలతో అమరావతిని ముంచాలన్న వైసీపీ యత్నం విఫలం: మంత్రి నిమ్మల
AP Minister Nimmala Ramanayudu

అమరావతి, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanayudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని లేపడానికి, పొన్నూరును ముంచేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయని విమర్శించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ(శుక్రవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ మూసి ఉందా, తెరిచి ఉందా అంటే అంబటి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు.


చేబ్రోలు, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో 200 నుంచి 300 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు విషయం తెలుసా అంటే అంబటి నుంచి ఎందుకు సమాధానం లేదని నిలదీశారు. పొన్నూరుపైనే కాదు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడం లేదని, బెజవాడ మునిగిపోతుందని, కాపర్ డ్యాం కొట్టుకుపోతుందని, తుంగభద్ర గేట్లు లేవడం లేదంటూ నిత్యం అబద్ధాలు, అసత్యాలే వైసీపీ ప్రచారమని ధ్వజమెత్తారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియా ప్రజల్లో భయాందోళనలు, అనుమానాలు రేకెత్తించడం అశాంతిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నట్లుగానే వైసీపీ నేతల మాటల్లో నిజాయితీ కూడా ఉండదని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2025 | 06:08 PM