Share News

AP Govt On Montha Cyclone: ‘మొంథా’ తుపాను..ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు

ABN , Publish Date - Oct 25 , 2025 | 09:36 PM

మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులకి రాష్ట్ర సర్కార్ దిశానిర్దేశం చేసింది.

AP Govt On Montha Cyclone:  ‘మొంథా’ తుపాను..ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు
AP Govt On Montha Cyclone

అమరావతి, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుపాను (Montha Cyclone) ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులకి రాష్ట్ర సర్కార్ దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వివరించారు.


తుపాను వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

  • ‘మొంథా’ తుపానుపై పుకార్లను నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండాలి, భయపడవద్దు.

  • అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి.

  • వాతావరణ హెచ్చరికల కోసం SMSలను గమనిస్తూ ఉండాలి.

  • రేడియో లేదా టీవీ న్యూస్ చూడాలి, వార్తాపత్రికలు చదవాలి.

  • మీ పత్రాలు లేదా సర్టిఫికెట్స్, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు లేదా రక్షణగా ఉండే కవర్‌లో ఉంచాలి.

  • ఖాళీ గదిలో ఉండటానికి ప్రయత్నించండి.

  • అదేవిధంగా వస్తువులు కదలకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • భద్రత, మనుగడ కోసం అవసరమైన వస్తువులతో అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.


  • మీ ఇంటిని ముఖ్యంగా పైకప్పును భద్రపరచుకోండి.

  • ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలి.

  • ఇంట్లో పదునైన వస్తువులను వదులుగా ఉంచవద్దు.

  • పశువులు లేదా జంతువులను పూర్తిగా వాటికి కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయండి

  • తుపాను ఉప్పెన లేదా ఆటుపోట్ల హెచ్చరిక లేదా వరదలు వచ్చినప్పుడు, మీ సమీప సురక్షితమైన ఎత్తైన భూమి లేదా సురక్షితమైన ప్రాంతంలో ఆశ్రయం పొందండి.

  • దానికి సురక్షితమైన మార్గాన్ని తెలుసుకోండి.

  • కనీసం ఒక వారం పాటు ఉండటానికి తగినంత ఆహారం, నీరు నిల్వలను సిద్ధం చేసుకోండి.

  • మీ కుటుంబం కోసం, సంఘం కోసం నిర్వహించే కృత్రిమ విపత్తులు(మాక్ డ్రిల్స్) / శిక్షణ తరగతుల్లో పాల్గొనాలి.

  • స్థానిక అధికారుల అనుమతితో మీ ఇంటి దగ్గర చెట్ల కొమ్మలను కత్తిరించాలి.

  • తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయండి.

  • ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు త్వరగా వెళ్లాలి.


తుపాను వచ్చే సమయంలో ఇంట్లో ఉంటే ఏం చేయాలంటే..

  • ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ఛాఫ్ చేయాలి.

  • అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షలను తీసివేయాలి.

  • తలుపులు, కిటికీలు మూసివేసి ఉంచాలి.

  • మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుపాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం లేదా షెల్టర్‌కు చేరుకోవాలి.

  • రేడియో న్యూస్ వినండి, అధికారిక హెచ్చరికలపై మాత్రమే ఆధారపడాలి.

  • వేడిచేసిన లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి.

  • భవనం కూలిపోవటం జరుగుతుంటే, దుప్పట్లు, రగ్గులు లేదా దుప్పట్లతో లేదా బలమైన టేబుల్ లేదా బెంచ్ కిందకు దూరడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.


తుపాను వచ్చే సమయంలో బయట ఉంటే..

  • దెబ్బతిన్న లేదా పాత భవనాల్లోకి ప్రవేశించవద్దు.

  • వీలైనంత త్వరగా సురక్షితమైన ఆశ్రయం లేదా షెల్టర్‌కు చేరుకోవాలి.

  • చెట్టు లేదా విద్యుత్ స్తంభం కింద ఎప్పుడూ నిలబడకండి.

  • వాతావరణం ప్రశాంతంగా ఉంటే జాగ్రత్తగా, నిశితంగా వేచి చూడాలి.

  • తుపాను ముగిసిందని అనుకోకండి.. ఒక్కసారిగా భారీ హింసాత్మక గాలులు.. మరొక దిశ నుంచి తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయి.

  • అధికారిక ఉత్తర్వులు 'ఆల్ క్లియర్' అని వచ్చేంతవరకు సహనంతో ఉండాలి.


తుపాను తగ్గిన తర్వాత..

  • మిమ్మల్ని షెల్టర్ లేదా ఏదైనా ఆశ్రయంలో ఉంచితే అధికారులు చెప్పేవరకు తిరిగి బయటకు వెళ్లవద్దు.

  • విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు లేదా తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుంచి జాగ్రత్తలు తీసుకోండి.

  • దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను లేదా వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్‌తో తనిఖీ చేయించాలి.


తుపాను వచ్చే సమయంలో మత్స్యకారులు చేయాల్సినవి ఇవే..

  • మొబైల్ ఫోన్లను అత్యవసర సమయంలో వాడటానికి లేదా కమ్యూనికేషన్‌కు ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచాలి.

  • ముఖ్యమైన ఫోన్ నంబర్స్‌ను కాగితంపై రాసి సురక్షితంగా ఉంచాలి.

  • అదనపు బ్యాటరీలతో రేడియోని మీతో ఉంచుకోండి.

  • పడవలు లేదా తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో కట్టి ఉంచండి. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 10:11 PM