Share News

Banakacherla Project: బనకచర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 09:44 PM

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గోదావరిలో నీళ్లను ఇరు తెలుగు రాష్ట్రాలు వాడుతున్నాయని వివరించారు. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. ఇక్కడికి వచ్చిన నీటిని మరో బేసిన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కృష్ణాలో తక్కువగా ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ వల్ల ఎవరికీ నష్టం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Banakacherla Project: బనకచర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
AP CM Nara Chandrababu Naidu

అమరావతి, జులై 19: బనకచర్ల ప్రాజెక్టుపై (Banakacharla Project) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) కీలక కామెంట్స్ చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సీఎం.. ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తాను చాలాసార్లు చెప్పానని అన్నారు. పోలవరం మినహా ఇంకా అక్కడ ఏ ప్రాజెక్ట్‌కి అనుమతి లేదని సీఎం స్పష్టం చేశారు.


గోదావరి నుంచి నీళ్లను వేరే బేసిన్‌కు తీసుకువెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి నీళ్లతో కాళేశ్వరం కట్టినప్పుడు తాను అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్లు ఉన్నారని.. తాను తెలంగాణ వాళ్లతో ఎప్పుడూ గొడవ పడలేదన్నారు. గొడవ పడటం అనేది ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందన్నారు. తాను హైదరాబాద్‌ను ఏపీ కోసం అభివృద్ధి చేశానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను హైదరాబాద్ కావాలని ఎలా అడుగుతానని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.


సీఎం చంద్రబాబు కామెంట్స్ యధావిధిగా..

‘మీరు కట్టే ప్రాజెక్ట్‌లు అన్ని కట్టండి.. పోరాటాలు తర్వాత చేయొచ్చు. మేం హామీ ఇచ్చింది డబుల్ ఇంజన్ సర్కార్. అంటే దాని అర్థం ఏమిటో తెలుసుకోండి. అందరు కలిసి రాష్ట్రాలను పోటీ పడి అభివృద్ధి చేయాలనేది నా కోరిక. తెలుగు జాతిని నంబర్ వన్‌గా చేయడం అందరి బాధ్యత.. అందుకోసం అందరం పని చేద్దాం. నేను ఎవరితో గొడవ పెట్టుకోను.. కానీ రాష్ట్రం హితం కోసం పోరాడుతా. బనకచర్ల వల్ల ఎవరికీ నష్టం లేదు. వరద జలాలను మాత్రమే వాడతామని చెప్పాం.’ అని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.


వ్యతిరేకిస్తున్న తెలంగాణ..

కాగా, బనకచర్ల ప్రాజెక్ట్‌ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ లింక్ చేయడం వల్ల తెలంగాణ నష్టపోయే అవకాశం ఉందని ఆరోపిస్తోంది. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించి.. బనకచర్ల ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని.. ఎట్టి పరిస్థితిల్లోనూ దీనిని అడ్డుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి

జగన్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. పట్టాభి సెటైర్

జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 09:56 PM