Share News

Varma Counter on YS Jagan: యూరియాపై రాద్దాంతం చేస్తున్నారు.. జగన్‌పై వర్మ ఫైర్

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:32 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుతున్న జగన్ కావాలని రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Varma Counter on YS Jagan: యూరియాపై రాద్దాంతం చేస్తున్నారు.. జగన్‌పై వర్మ ఫైర్
Varma Counter on YS Jagan

కాకినాడ జిల్లా పిఠాపురం, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ (Satyanarayana Varma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుతున్న జగన్ కావాలని రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లాకు 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటికే 19, 385 మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీల ద్వారా అందిందని వివరించారు సత్యనారాయణ వర్మ.


ఇవాళ(శనివారం) పిఠాపురంలో వర్మ మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా యూరియాను అమ్ముకునే వారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మార్పీ రేటుకే యూరియా అందుతుంటే జగన్‌కు కనిపించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు యూరియాను సంపూర్ణంగా రైతులకు అందించని ఘనత వైసీపీదేనని ఆక్షేపించారు. జగన్ హయాంలో ధాన్యం రైతులకు ఏడాది గడిస్తేనే కానీ పైసలు వచ్చేవి కాదని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో నెల రోజుల్లోనే అన్నదాతలకు డబ్బులు అందించి రైతు పక్షపాతిగా సీఎం చంద్రబాబు నిలిచారని మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్మార్ట్ ఫోన్లు వచ్చాక లఘు చిత్రాలకు పెరిగిన ఆదరణ: మంత్రి నిమ్మల

మరోసారి రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఏం చేశారంటే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 06 , 2025 | 02:41 PM