Nimmala Ramanaidu on Short Films: స్మార్ట్ ఫోన్లు వచ్చాక లఘు చిత్రాలకు పెరిగిన ఆదరణ: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:29 PM
స్మార్ట్ ఫోన్లు వచ్చాక లఘు చిత్రాలకు విపరీతమైన ఆదరణ పెరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. లఘు చిత్రాలు ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు వినోదాన్ని కలిగిస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ ఫోన్లు వచ్చాక లఘు చిత్రాలకు విపరీతమైన ఆదరణ పెరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) వ్యాఖ్యానించారు. లఘు చిత్రాలు ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు వినోదాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇవాళ(శనివారం) పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నాల్గో అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
నేటి యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, కొత్త ఆలోచనలను వెలికి తీసేందుకు లఘుచిత్రాలు దోహదపడుతున్నాయని ఉద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానం తోడవడంతో ఎన్నో అద్భుత లఘు చిత్రాలను ఆవిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. లఘు చిత్రాల ద్వారా కొత్త దర్శకులతో పాటు, నటీనటులు తమ ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లు నుంచి దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, అల్లు రామలింగయ్య, అనంత శ్రీరామ్, రేలంగి నరసింహరావు ఇలా ఎందరో కళాకారులు రాణించారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు
వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..
Read Latest Andhra Pradesh News and National News