Minister Nimmala Ramanaidu: నాపై సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. మంత్రి నిమ్మల ధ్వజం
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:51 PM
పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్‌లో దొరికినా, అక్రమ సంపాదనలు వెలుగు చూసినా అరాచకాలను సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించడం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. తాను బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందని విమర్శించారు. ఇవాళ(మంగళవారం) పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. దాడులు, కక్షలు, అక్రమ కేసులు విధ్వంస పాలనే తప్ప ప్రజా సంక్షేమాన్ని జగన్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభలో కత్తిలాంటి బటన్ స్టిక్‌లు పట్టుకుని తమను స్టేజిపై నుంచి గెంటివేసినప్పుడు ఈ సాక్షి దినపత్రిక ఏమైందని ప్రశ్నించారు. తమపై దాడులు చేసి తమపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన వారిపై తాము రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించడం తప్పా అని నిలదీశారు. తాము మంజూరు చేసి నిర్మించిన టిడ్కో సముదాయంలో ఒక్కొక్క ఇంటిపై రూ.3.65 లక్షలు రుణం తీసుకొని కోట్లాది రూపాయలను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ధ్వజమెత్తారు మంత్రి నిమ్మల రామానాయుడు.
పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్‌లో దొరికినా, అక్రమ సంపాదనలు వెలుగు చూసినా అరాచకాలను సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తాను బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వివిధ శాఖల నుంచి రూ. 430 కోట్ల పనులు నియోజకవర్గంలో జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది.. సీబీఐ స్పష్టం
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎన్ని రోజులో తెలుసా..
For More AP News and Telugu News