Viveka case: వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది.. సీబీఐ స్పష్టం
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:10 AM
వివేకా హత్యకేసుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.
ఢిల్లీ: వివేకా హత్యకేసుపై (Viveka case) ఇవాళ(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు (CBI) సుప్రీంకోర్టుకు (Supreme Court) స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదని తేల్చిచెప్పారు. తమ తరఫు నుంచి దర్యాప్తు ముగిసిందని తెలిపారు సీబీఐ అధికారులు. న్యాయస్థానం దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వివేకా హత్య కేసు విచారణ జరిగింది.
వివేకా కుమార్తె సునీత తరఫు సీనియర్ కౌన్సిల్ వేరే కోర్టులో ఉన్నందున జూనియర్ లాయర్ విచారణ పాస్ ఓవర్ కోరారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే వివేకా హత్య కేసును తదుపరి కొనసాగిస్తామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి సీబీఐ అధికారులు వివరించారు. కాగా, వివేకా కేసుపై ఇవాళ (మంగళవారం) మరోసారి జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
For More AP News and Telugu News