Traffic Enforcement: ట్రాఫిక్ ఉల్లంఘనలపైఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:23 AM
రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు చేపట్టాలని డీజీపీ హరీ్‌షకుమార్
రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణకు డీజీపీ ఆదేశాలు
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు చేపట్టాలని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ డ్రైవ్‌లు వారాని కి ఒకసారి చొప్పున నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అమల్లోకి వస్తాయని పోలీసుశాఖ ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10 వరకు ‘మద్యం సేవించి వాహనం నడపొద్దని హెచ్చరికతో డ్రైవ్’, ఆగస్టు 11 నుంచి 17 వరకు.. వేగం మితిమీరిన వాహనాలపై చర్యలు, ఆగస్టు 18నుంచి 24 వరకు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, అలాగే పిలియన్ రైడర్లపై చర్యలు ఉంటాయన్నారు.