Massive Theft: రాత్రి రెక్కీ.. పగలు దొంగతనం.. పోలీసులకు సవాల్‌గా మారుతున్న వరుస చోరీలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:02 AM
రెంటచింతల మండల కేంద్రమైన రెంటచింతలలోని రేంజర్ వీదిలో(రైస్ మిల్ వద్ద) ఆదివారం రాత్రి టీచర్ల గృ హంలో భారీ దొంగతనం జరిగింది. దంపతులిద్దరూ ఊరెళ్లడంతో.. దొంగలు ఇనుప రాడ్‌తో తాళాలు, బీరువాను పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు.
» 122 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ
రెంటచింతల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన రెంటచింతలలోని (Rentachintala Theft) రేంజర్ వీదిలో(రైస్ మిల్ వద్ద) ఆదివారం రాత్రి టీచర్ల గృ హంలో భారీ దొంగతనం జరిగింది. దంపతులిద్దరూ ఊరెళ్లడంతో.. దొంగలు ఇనుప రాడ్‌తో తాళాలు, బీరువాను పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. గుంటూరు జిల్లా పోలీసులు సేకరించిన వివరాల మేరకు... గెల్లిపోగు జనార్థనరావు, సుమతి గ్రేస్ భార్యభర్తలు. జనార్థనరావు జెట్టిపాలెం మోడల్ స్కూల్లో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా... సుమతి గ్రేస్ స్థానిక విద్యాశాఖలో సీఆర్పీగా పనిచేస్తున్నారు. జనార్థనరావు తల్లి మరియమ్మ అస్వస్థతకు లోనుకావడంతో.. పలకరించేందుకు వారు మాచర్లకు వెళ్లారు.
ఉదయం రెంటచింతల ఇంటికి వచ్చి చూడగా.. తాళాలు పగలకొట్టి తలు పులు, బీరువా తెరిచి ఉండటం గమనించారు. చోరీ జరిగినట్లు నిర్ధారించకున్నారు. బీరువాలో ఉంచిన శంకరాభరణం బు ట్టలు, హ్యాంగర్స్, చైన్లు, ఉంగరాలు, కెంపుల పచ్చల బుట్టలు దాదాపు 122 గ్రాముల ఆభరణాలు గురయ్యాయని తెలిపారు. అలాగే జనార్థనరావు పాపకు పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో పాఠశాల నుంచి వచ్చిన బహుమతి రూ.20 వేల నగదును పట్టుకుపోయారని తెలిపారు. ఘటన స్థలాన్ని కారంపూడి సీఐ టీవీ శ్రీనివాసరావు, ఎస్ఐఐ సీహెచ్ నాగార్జున సందర్శించి బాధితుల నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. అలాగే గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో బావమరిది ఇంటిలో..
గెల్లిపోగు జనార్థనరావు మాస్టార్ బావమర్ది ప్రసాద్ మాస్టర్ గృహంలో కూడా 2022 ఆగస్టు 19న దొంగతనం జరిగింది. భార్యభర్తలిద్దరూ స్కూల్‌కి వెళ్లి ఇంటికొచ్చేసరికి రూ.3.45 లక్షలు విలువైన బంగారం, నగలు అపహరించుకెళ్లారు. మిర్యాలగూడకు చెందిన నేరస్తుడిని అప్పటి ఎస్ఐ సమీర్ బాష పట్టుకుని కొంత సొమ్మును రికవరీ చేశారు.
రెంటచింతలలో తచ్చాడిన పాత నేరస్తులు
గతంలో దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన వారు మూడు రోజుల క్రితం రెంటచింతలలో సంచరించినట్లు సమాచారం. పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీలే వారి పని. ఈ ఏడాది ఫిబ్రవరి 17న మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ ఆదూరి ఇన్నారెడ్డి గృహంతో పాటు వ్యాపారి సాంబశివరాలు ఇంటిలోనూ చోరీ జరిగింది. అలాగే 2010 ఆగస్టు 11న రాము మాస్టార్ ఇంటిలో చోరీ జరగ్గా సుమారు రూ.10 లక్షలు విలువైన బంగారం, నగదు అపహరణకు గురయ్యాయి. ఆ చోర్ మిస్టరీ నేటికి వీడలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
For More AP News and Telugu News