TDR Bond Scam: కాకినాడ టీడీఆర్ బాండ్ల కుంభకోణం.. బాధ్యులపై చర్యలెక్కడ?
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:49 AM
కాకినాడ కార్పొరేషన్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీచేసిన రూ.411కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల జారీ కుంభకోణంపై బాధ్యులపై భర్యలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిగి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది.
» కాకినాడలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై చర్యలేవి
» విజిలెన్స్ విచారణలో నాటి వైసీపీ కీలక నేత బండారం బద్దలు
» ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ అధికారుల నివేదిక: అయినా చర్యలకు మీనమేషాలే
» గత వైసీపీ హయాంలో అడ్డగోలుగా రూ.411కోట్ల విలువైన బాండ్ల జారీ
» తెరవెనుక చక్రం తిప్పిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి
(కాకినాడ,ఆంధ్రజ్యోతి): కాకినాడ కార్పొరేషన్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీచేసిన రూ.411కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల జారీ కుంభకోణంపై (TDR Bond Scam) బాధ్యులపై భర్యలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిగి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఆక్రమార్కులపై కనీసం చర్యలు ఉండడంలేదు. నివేదికలో అప్పటి వైసీపీ కీలకనేత, ఆయనకు సహకరించిన కొందరు అధికారులు ఏ స్థాయిలో అడ్డగోలుగా వ్యవహారించారో తేలింది. బాధ్యులు టీడీఆర్ బాండ్ల జారీతో కార్పొరేషన్ ఆదాయానికి కోట్లలో గండికొట్టారని తేల్చింది. ఎన్నో స్థలాలున్నా కేవలం కొందరికి లబ్ధి చేకూర్చడం కోసమే టీడీఆర్ నాటకం ఆడారని తేలిపోయింది. ఇవన్నీ కూలంకషంగా ప్రభుత్వానికి అందిన నివేదికలో ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించే చిన్న పురోగతి కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వాడంతా అడ్డగోలే..
గత ప్రభుత్వ హయాంలో కాకినాడ కార్పొరేషన్‌ను వైసీపీ నేతలు పూర్తిగా దోచేశారు. తాము కోట్లలో సంపాదించుకోవడానికి స్కెచ్ వేసుకుని టీడీఆర్ బాండ్లను అడ్డం పెట్టుకున్నారు. చేతిలో అధికారం ఉండటంతో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి తనకు నచ్చినట్లు బాండ్ల విలువ కట్టించుకున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలకు రెండేళ్ల ముండు కాకినాడ కార్పొరేషన్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి ద్వారంపూడి ఆదేశాలతో ఏకంగా రూ.411 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేసేశారు.
ముఖ్యంగా కాకినాడ సురేశ్ నగర్ పార్కు వ్యవహారంలో రూ.100కోట్ల వరకు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు జారీ చేసేశారు. వాస్తవానికి ఈ పార్కు పూర్తిగా ప్రభుత్వ స్థలం, దీనిలో పార్కు అభివృద్ధికి కార్పొరేషన్ నిధులు కూడా వచ్చింది. కానీ పార్కు స్థలం తనది అంటూ ఓ వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు సృష్టించాడు. తన స్థలంలో పార్కు ఎలా నిర్మిస్తారంటూ అధికారులను బెదిరించాడు. ఇంతలో ద్వారంపూడి జోక్యం చేసుకున్నారు. తతంగం నడిపి భారీగా డబ్బులు కొట్టేశారు. ఇందులో భాగంగా పార్కు స్థలం తనది అని నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తికి అండగా నిలబడ్డారు. ఈ స్థలాన్ని తిరిగి కార్పొరేషన్ పార్కు కోసం తీసుకోవడానికి నమ్మతించేలా చేసి ఆ స్థలానికి ధర కట్టించారు. ఆ మొత్తాన్ని నగదుకు బదులు టీడీఆర్ బాండ్ల రూపంలో జారీ చేశారు. అంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తికి డబ్బులిచ్చి కొనుగోలు చేసినట్లయింది.
రెండో కుంభకోణం...
రెండో కుంభకోణం కాకినాడ నగరానికి సమీపంలో దుమ్ములపేటలో చోటుచేసుకుంది. ఇక్కడ పరిశ్రమల అవసరాల కోసం ఓ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలని ట్రాన్స్ కో నిర్ణయించింది. దీనికి అవసరమయ్యే స్థలం చాలా తక్కువ. పైగా ఈ స్థలాన్ని ట్రాన్స్ కో స్వయంగా సమకూర్చుకోవాలి. లేదంటే పక్కనే ఉన్న పోర్టు భూములు కావాలని కలెక్టర్‌ని కోరాలి. కానీ దుమ్ములపేటలో ఓప్రైవేటు వ్యక్తికి ఉన్న భూమిణి కోట్లలో లాభం వచ్చేలా చేయడానికి అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి రంగంలోకి దిగారు. విద్యుత్ సిటీ స్టేషన్ నిర్మాణానికి సంబంధం లేని కార్పొరేషన్‌ను రంగులోకి దించారు. దీని ద్వారా ప్రభుత్వ స్థలానికి బదులు తనకు కావాల్సిన వ్యక్తి ప్రైవేటు భూమి సేకరించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. దుమ్ముల పేటలో 487 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. గజం రూ.28 వేల మార్కెట్ ధర చొప్పున 1:4నిష్పత్తిలో రూ.251కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను సదరు ప్రైవేటు వ్యక్తికి జారీ చేసేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి భూమికి మేలు చేకూర్చి బారీగా సదరు నేత తెర వెనుక డబ్బులు గుంజేశారు. ఈ అడ్డగోలు అక్రమాలపై అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ పోరాటం చేసింది కొండబాబు ఆధ్వర్యంలో ఆందోళనబాట పట్టింది. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
విజిలెన్స్ వివేదిక వచ్చినా..
గతేడాది ప్రభుత్వం మారడంతో టీడీఆర్ కుంబకోణం గుట్టు వీడుతుందని భావించారు. కానీ ఉన్నతాదికారులు కనీసం దృష్టిపెట్టలేదు. అదేసమయంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తలుకుబోరూ 1100కోట్ల విలువైన టీడీఆర్ బాం ద్రను గత ప్రభుత్వ హయాంలో అధికారులు జారీ చేశారు. దీనివెనుక కుంభకోణం జరిగింద ని నిర్ధారించిన ప్రభుత్వం వీటి విలువను బా రీగా బదించాలని గతేడాది నిర్ణయించింది. డీ ని వెనుక ఎవరెవరున్నారనే విరా రణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాకినాడ టీడీఆర్ బాండ్లపైనా విచారణకు జడుగులు ప న్నాయి. కార్పొరేషన్ పరిధిలో రూ. 11కోట్లు విలు వైన టీవీఆర్ బాండ్లను అధికారులు ఎలా అడ్డ గోలుగా జారీచేశారు. దీనివెనుక అప్పట్వినీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎలా చక్రం తిప్పారు? అనేదానిపై గతేడాది ఇంరులో సీఎం చంద్ర బాబును కలిసి కాకినాడసిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వివరించారు.
పక్కా ఆధారాలతో వివరాలు అందించారు. దీనిపై విచారణ చేపట్టి బాండ్ల కుంభకోణం నిగ్గుతేల్చాలని కోరారు. దీంతో సీఎం ప్రధాన కార్యదర్శి అయిన ముద్దాడ రవిచంద్రను పిలిపించి ఈ కుంభకోణం సంగతి తేల్చాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగగా టీపీఆర్ స్కాంపై విచారణ జరిపారు. వీటిని జారీ చేయడం వెనుక జరిగిన తంతంగాన్ని మొత్తం కూలంకషంగా వెలికితీశారు సురేషన్ నగర్ పార్కుస్థలం ప్రభత్యానిది అయినా ఒత్తిళ్లకు లొంగి అధికారులు ఎవరెవరు ఎలా సహకరించారనేది విశ్లేషించారు. నివేదిక ప్రభుత్వానికి వెళ్లి నెలలు గడుస్తున్నా అక్రమార్కులపై చర్యలు లేవు. అదే వైసీపీ హయాంలో కరప మండలం ఆరట్లకట్టు చెరుపు పూడికతీత, మడ అడవుల పదును, ఈట్ స్ట్రీట్ వ్యవహారంలో కొందరు అధికారులపై విచారణకు ఆదేశించింది. అంతకంటే కీలకమైన టీడీఆర్ బాండ్ల సూత్రధారులపై దృష్టిపెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
For More AP News and Telugu News