Share News

Loksabha Polls 2024: ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఆర్.. కొండా సురేఖ విమర్శ

ABN , Publish Date - Apr 29 , 2024 | 02:07 PM

Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర్ రెడ్డి అయితే.. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఅర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

Loksabha Polls 2024: ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఆర్.. కొండా సురేఖ విమర్శ
Minister Konda Surekha

సిద్దిపేట జిల్లా, ఏప్రిల్ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR), మాజీ మంత్రి కేటీఆర్‌పై (Former Minister KTR) మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర్ రెడ్డి (YSR) అయితే.. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఅర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు ( (Congress Candidate Neelam Madhu) మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాక ముందు దళితుడిని సీఎం చేస్తా అని చెప్పి కేసీఆర్ సీఎం అయ్యారన్నారు.

AP Elections: ఆ ఓట్లపైనే ఫోకస్.. ఆకర్షించేందుకు పోటీపడుతున్న పార్టీలు..


ఎన్నికల అయ్యాక వడ్లకు బోనస్...

ప్రాజెక్ట్‌ల పేరుతో కేసీఆర్ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కవిత తీసుకువచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. తెలంగాణ తనది అని షాడో ముఖ్యమంత్రిగా వ్యవస్థను నడిపించిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. తెలంగాణను భ్రష్టు పట్టించి, అవినీతితో కోట్లు సంపాదించిన ఘనత కేటీఆర్ ది అంటూ విమర్శించారు. 4 నెలల్లో ఐదు గ్యారెంటీలను నెరవేర్చామని అన్నారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల వడ్లకు బోనస్ ఇవ్వలేక పోయామని.. ఎలక్షన్లు అపోయిన వెంటనే వడ్లకు బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని.. ఇక రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.

JP Nadda: కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి


అయోధ్యలో సీత లేకపోవడం అరిష్టం...

తాము కాళేశ్వరం వెళ్తే అవహేళన చేశారని.. కాళేశ్వరం మంచిగా కట్టిస్తే రైతులంతా సంతోషంగా ఉండేవాళ్లన్నారు. ఎమ్మేల్యేగా ఉన్న సమయంలో దుబ్బాకకు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. బిడ్డను బయటకు తేవడానికి బీజేపీకి ఓటు వేయమని కేసీఆర్ చెప్తున్నారన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ రిజర్వేషన్లు ఎత్తివేస్తానని అంటున్నారని...అలా చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించారు. ఓట్ల కోసం బీజేపీ దేవుళ్ళను వాడుకుంటోందని మండిపడ్డారు. మోదీ అయోధ్యలో సీతాదేవి లేకుండా బాలరాముని విగ్రహం ఒకటే కట్టడం అది అరిష్టమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Election 2024: పెన్షన్ల పంపిణీలో వైసీపీ డ్రామాలు: చంద్రబాబు

CM Jagan: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 05:03 PM