Share News

AP Elections: జగన్‌లో ఆందోళన.. అభ్యర్థులపై ఒత్తిడి.. అసలు కారణం అదే..!

ABN , Publish Date - May 03 , 2024 | 10:41 AM

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.

AP Elections: జగన్‌లో ఆందోళన.. అభ్యర్థులపై ఒత్తిడి.. అసలు కారణం అదే..!
CM Jagan

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా.. సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుండటంతో జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ లేదనుకున్న నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పోటీలోకి రావడం, విజయవకాశాలను మెరుగుపర్చుకోవడంతో వైసీపీ అధినేత జగన్‌ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.


అభ్యర్థితో సంబంధం లేకుండా వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఏపీ ఓటరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలే తమ ప్రచారస్త్రం అవుతుందని భావించిన వైసీపీకి నిరాశే ఎదురైంది. వైసీపీ కంటే ఉత్తమంగా సంక్షేమ పథకాలు అందిస్తామని, ఏ పథకానికి కోత పెట్టబోమని టీడీపీ, జనసేన కూటమి మేనిఫెస్టోలో పొందుపర్చడంతో సంక్షేమ పథకాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చినా.. అన్ని పథకాలు అమలవుతాయనే ఆలోచనలో ఓటర్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో వైసీపీకి ఓటు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతుందని వైసీపీ నాయకులే తమ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ఇదే విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్థులపై జగన్ తీవ్ర ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలని, అవసరమైతే ఎంత డబ్బు ఖర్చుపెట్టడానికైనా వెనుకాడవద్దంటూ వైసీపీ అధిష్టానం అభ్యర్థులకు చెబుతున్నట్లు సమాచారం. అవసరమైతే అధిష్టానం నుంచి కొంత సహయం అందిస్తామని.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు డబ్బులు ఖర్చుపెట్టాలని వైసీపీ అధిష్టానం అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది.

20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది


డబ్బు ఖర్చుపెట్టినా..

రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చుపెట్టినా వైసీపీ అభ్యర్థి గెలవడం కష్టమని అంతర్గత సర్వేల్లో తేలడంతో అభ్యర్థులు ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఎంత ఖర్చు చేసినా తాము గెలవడం అసాధ్యమనే భావనకు కొందరు వైసీపీ అభ్యర్థులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్టణం జిల్లాలో 2 నుంచి 3 నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో వైసీపీకి గెలిచే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు ప్రచారం కోసం పెద్దగా ఖర్చు చేయడంలేదట. కేవలం గెలవడానికి అవకాశాలు ఉన్న చోట్ల మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.


వైసీపీ అధిష్టానం మాత్రం..

వైసీపీ అధిష్టానం మాత్రం ప్రతి నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని అభ్యర్థులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా ఒకరిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక సహాయం అవసరమైతే ఎంపీ అభ్యర్థులు చేయాలని, కొంతమేరకు అధిష్టానం నుంచి అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బు పంపిణీకి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రతి ఓటరుకు డబ్బులు అందేలా చూడాలని జగన్ చెప్పినట్లు సమాచారం. ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. చివరికి డబ్బు ద్వారా కొంతమంది ఓటర్లను తమవైప్పు తిప్పుకుంటే గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించవచ్చనే ప్లాన్‌లో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది మాత్రం జూన్4న తేలనుంది.


మళ్లీ జగన్‌ వద్దు!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 10:41 AM