AP Capitals : ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు.. ఈ కామెంట్స్‌తో..

ABN , First Publish Date - 2023-02-11T17:17:17+05:30 IST

ఏపీలో మూడు రాజధానులపై (AP Three Capitals) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (AP CM Jagan) ఢిల్లీ (Delhi) వేదికగా విశాఖే (Visakha) రాజధాని అని...

AP Capitals : ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు.. ఈ కామెంట్స్‌తో..

అమరావతి/పశ్చిమ గోదావరి : ఏపీలో మూడు రాజధానులపై (AP Three Capitals) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (AP CM Jagan) ఢిల్లీ (Delhi) వేదికగా విశాఖే (Visakha) రాజధాని అని.. త్వరలోనే అక్కడ్నుంచే కార్యకలాపాలు సాగుతాయని కీలక ప్రకటన చేసేశారు. ఇప్పటిదాకా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని మాత్రమే జగన్‌ చెబుతూ వచ్చారు. వైజాగ్‌(Vizag)కు రాజధాని తరలిపోతుందని మాత్రం తొలిసారి గ్లోబల్‌ సమ్మిట్‌ సన్నాహక భేటీలోనే ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటన నేపథ్యంలో కొద్దిరోజులుగా రాష్ట్రం రాజకీయంగానూ.. పాలనాపరంగానూ సెగలు కక్కుతోంది. అయితే, సుప్రీం కోర్టు (Supreme Court)లో రాజధాని అంశం ఉందని.. ఈ సమయంలో సీఎం చేసిన వ్యాఖ్య లు కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందంటూ న్యాయనిపుణులు హెచ్చరించారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి-23న సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరగనుంది. ఆ రోజు సుప్రీంకోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మూడు రాజధానులపై తాజాగా.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkayya Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో RKR కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థిని నుంచి రాజధానిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై వెంకయ్య స్పందిస్తూ కీలక వ్యాఖ్యలే చేశారు.

Venkayya-1.jpg

ఆయన కామెంట్స్ ఇవీ..

తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని.. రాజధాని ఏర్పాటు అనేది ప్రజాభిప్రాయం ప్రకారమే జరగాలన్నారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానని మరోసారి గుర్తు చేశారు వెంకయ్య. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్న విషయాన్ని కూడా గుర్తు చేశారాయన. అంతేకాదు.. అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానన్నారు. ఈ మాటలను బట్టి అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నానని వెంకయ్య క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

అప్పట్లో ఇలా..

ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్క చోటే ఉండాలని అప్పట్లో వెంకయ్య చెప్పుకొచ్చారు. ఇలా అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని.. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమన్నారు. 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నట్లు వెంకయ్య వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని వివాదం కోసమో, రాజకీయ కోణంలోనో చూడొద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం తనను రాజధాని విషయం అడిగినా ఇదే విషయమే చెబుతానని వెంకయ్య తెలిపారు. చివరగా.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. అలాగే పరిపాలన కేంద్రీకృతం కావాలని రాజధాని రైతులు కలిసినప్పుడు వెంకయ్య ఈ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి..

AP Politics : పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్న ప్రశ్న.. టీడీపీలో ఎందుకు చేరలేదు అని బాలయ్య అడగ్గా.. పవన్ చెప్పిన సమాధానం ఇదీ.. హై ఓల్టేజ్..

*************************

Ponguleti : తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యక్షమైన పొంగులేటి.. జగన్‌తో గంటపాటు ఏకాంత భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఓహో అసలు కథ ఇదా..!

*************************

AP Politics : పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్న ప్రశ్న.. టీడీపీలో ఎందుకు చేరలేదు అని బాలయ్య అడగ్గా.. పవన్ చెప్పిన సమాధానం ఇదీ.. హై ఓల్టేజ్..

*************************

Ponguleti : అభిమానుల సాక్షిగా పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పొంగులేటి.. అంతా సరే కానీ..!

*************************

YS Jagan : మైలవరం పంచాయితీపై ఒక్కమాటతో తేల్చేసిన సీఎం జగన్.. భేటీ తర్వాత పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేసిన వసంత కృష్ణప్రసాద్.. ఇదీ అసలు కథ..

*************************

Telugudesam : ఫిబ్రవరి16న టీడీపీలో చేరనున్న కీలక వ్యక్తి.. పెద్ద బాధ్యతలు అప్పగించనున్న చంద్రబాబు..


*************************

YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

*************************

YS Jagan : శభాష్ అంటూ ముగ్గురు మంత్రులను మెచ్చుకున్న వైఎస్ జగన్.. అందులో ఒకరు...!

*************************

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

*************************


KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

*************************

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

*************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

*************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

*************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

*************************


Updated Date - 2023-02-11T17:36:15+05:30 IST