YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

ABN , First Publish Date - 2023-02-07T23:28:14+05:30 IST

వైసీపీలో (YSRCP) ఎంత పెద్దోడు అయినా సరే.. తాను చెప్పింది వినాల్సిందే.. వినకుండా పార్టీ లైన్ దాటారో ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఈ మధ్య సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

వైసీపీలో (YSRCP) ఎంత పెద్దోడు అయినా సరే.. తాను చెప్పింది వినాల్సిందే.. వినకుండా పార్టీ లైన్ దాటారో ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఈ మధ్య సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రవర్తిస్తున్నారు. ఇలా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ram Narayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే (Kotamreddy Sridhar Reddy) పక్కనెట్టేశారు జగన్. ఎమ్మెల్యేలనే పక్కనెట్టిన జగన్ ఇక నియోజకవర్గ ఇంచార్జ్‌లు (Incharge) పార్టీ లైన్ దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) జరిగింది. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధిష్టానం దృష్టికి వచ్చిందంతే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే వేటుపడింది. ఇంతకీ ఎవరా కీలక నేత..? అసలేం జరిగిందనే విషయం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Saragadam.jpg

ఎవరాయన..!

అనకాపల్లి జిల్లా పెందుర్తి (Pendurthy) పట్టణంలో బలమైన సీనియర్ నాయకుడిగా (Senior Leader) గుర్తింపు ఉన్న శరగడం చినఅప్పలనాయుడు (Saragadam Chinna Appala Naidu)2019 ఫిబ్రవరిలో టీడీపీకి టాటా (Telugudesam) చెప్పి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), ఎమ్మెల్యే అదీప్‌రాజు (MLA Adeep Raju) సమక్షంలో శరగడంకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలోనే కాదు.. పార్టీ మారిన తర్వాత వైసీపీలోనూ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారాయన. అప్పటి వరకూ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అప్పలనాయుడకు పెందుర్తి నియోజకవర్గ బాధ్యతలను దాదాపు ఆయనే చూసుకుంటూ వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ సడన్‌గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది.

Saragadam.jpg-1.jpg

అసలేం జరిగింది..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్లుగా అందిన వరుస ఫిర్యాదులతో శరగడంను సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ఓ ప్రకటనతో తెలిపింది. పలుమార్లు అప్పలనాయుడు గురించి అధిష్టానానికి ఫిర్యాదులు అందగా.. అసలు అందులో నిజానిజాలెంత అని క్రమశిక్షణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాక సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఇంతకీ పార్టీలైన్ దాటి ఆయన ఏం చేశారన్నది తెలియరాలేదు. టీడీపీకి ఫేవర్‌గా ఉంటూ వైసీపీకి నష్టం కలిగించేలా కొన్ని పనులు చేసినట్లు లోలోపల చర్చలు నడుస్తున్నాయి. ఇందులో నిజమెంతో శరగడంకే తెలియాలి. ఈ మధ్యనే విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిశీలకుడిగా అప్పలనాయుడిని వైసీపీ అధిష్టానం నియమించింది.

Saragadam-Final.jpg

ఏం చేయబోతున్నారో..!

టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న శరగడం ఇప్పుడేం చేయబోతున్నారు..? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ సొంతగూటికి చేరుకుంటారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అప్పలనాయుడు మనసులో ఏముంది.. ఫైనల్ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే ఒకట్రెండ్రోజులు వేచి చూడాల్సిందే.

*****************************************

ఇవి కూడా చదవండి..

YSRCP : వైసీపీకి షాకిచ్చిన కీలక నేత.. రాజీనామా చేసి టీడీపీలో చేరిక.. అసలేం జరిగిందంటే..

*****************************************

Renuka Chowdhury : ఆహ్వానం వచ్చింది.. కొడాలి నానిపై పోటీకి సిద్ధమైన తెలంగాణ ఫైర్‌బ్రాండ్.. వర్కవుట్ అయ్యేనా..!?


*****************************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*****************************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?


*****************************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ


*****************************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..


*****************************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న రెండ్రోజులకే ఆదాలకు ఊహించని షాక్.. అరెరె ఇలా జరిగిందేంటి..!*****************************************

YSRCP : చంద్రబాబుతో రహస్య భేటీ.. టీడీపీలో చేరికపై ఒక్క ప్రెస్‌మీట్‌తో తేల్చేసిన వైసీపీ ఎంపీ.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2023-02-08T08:05:04+05:30 IST