YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

ABN , First Publish Date - 2023-02-07T17:19:08+05:30 IST

నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhareddy) వైసీపీకి (YSRCP) గుడ్ బై (Good Bye) చెప్పాక నియోజకవర్గ..

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

నెల్లూరు/అమరావతి : నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhareddy) వైసీపీకి (YSRCP) గుడ్ బై (Good Bye) చెప్పాక నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి (MP Adala Prabhakar Reddy) చేపట్టిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టాక సోమవారం నాడు మొదటిసారి రూరల్ నియోజకవర్గానికి విచ్చేశారాయన. ఆయనకు ఘన స్వాగతం పలకాలని అభిమానులు, అనుచరులు అనుకున్నా వారికి నిరాశే మిగిలింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదాలకు అనుకున్నంత ఆదరణ దక్కలేదనే చెప్పాలి. ఇక అవన్నీ అటుంచితే.. నియోజకవర్గంపై పట్టు సాధించుకోవాలని వరుస సమావేశాలతో ఆదాల బిజిబిజీగా గడుపుతున్నారు. సోమవారం నాడు నియోజకవర్గానికి వచ్చిన ఆయన.. మంగళవారం నాడు కార్పొరేటర్లు (Corporators), నేతలతో (Leaders) వరుసగా సమావేశం అయ్యారు.

Adala.jpg

మాటిస్తున్నా..

ఈ సమావేశంలో భాగంగా నేతల సమస్యలను విన్న ఆదాల.. వాటన్నింటికీ పరిష్కారమార్గం చూపుతానని మాటిచ్చారు. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు, కార్పొరేటర్లకు ఇకపై ఎలాంటి సమస్యలుండవి.. ఏమున్నా తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నగరానికి రింగ్ రోడ్డు, నియోజకవర్గానికి కావాల్సినన్ని నిధులు తెస్తానని ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. సమస్యలు ఏమున్నా సరే నేరుగా తనను సంప్రదించవచ్చని ప్రజలకు సూచించారు ఆదాల. ఇంఛార్జ్‌తో హామీతో కార్పొరేటర్లు, నేతలు.. ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Adala-1.jpg

రాబోయే 20 రోజుల్లో..

ఇదే సమావేశంలో ఆదాల మరో సరికొత్త హామీ ఇచ్చారు. కార్పోరేటర్లు, నేతలను రాబోయే 20 రోజుల లోపు, సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) దగ్గరికి తీసుకెళ్తానన్నారు. జగన్‌తో సమావేశం ఏర్పాటు చేసి.. ఫోటోలు (Photos) కూడా తీయిస్తానని ఆదాల హామీ ఇచ్చారు. ఆదాల చేస్తున్న ఈ పని ఒక ప్రయోగమే అని చెప్పుకోవచ్చు. మరోవైపు.. వైసీపీని ఎవరు వీడినా సీఎం జగన్‌కు ఎలాంటి నష్టమూ జరగదని.. నేతలకు ఆదాల ధైర్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని (Nellore District) అన్ని సీట్లుని వైసీపీ గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు సమావేశానికి వచ్చి వైసీపీతోనే ఉంటామన్నారని.. త్వరలోనే ఇంకా చాలా మంది వస్తారన్నారు.

Adala-2.jpg

మొత్తానికి చూస్తే.. నియోజకవర్గంలో పట్టు సాధించుకోవడానికి ఆదాల చేయాల్సిన ప్రయత్నాలన్నీ మొదటిరోజు నుంచే చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ వర్కవుట్ అవుతాయి..? రానున్న ఎన్నికల్లో ఇవన్నీ ఎంత మేర ఓట్లు సంపాదించిపెడతాయి..? అనేది వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2023-02-07T18:11:38+05:30 IST