Renuka Chowdhury : ఆహ్వానం వచ్చింది.. కొడాలి నానిపై పోటీకి సిద్ధమైన తెలంగాణ ఫైర్‌బ్రాండ్.. వర్కవుట్ అయ్యేనా..!?

ABN , First Publish Date - 2023-02-06T22:39:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudiwada) అసెంబ్లీ నియోజకర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకర్గంలో ఒకటి కాదు రెండు కాదు

Renuka Chowdhury : ఆహ్వానం వచ్చింది.. కొడాలి నానిపై పోటీకి సిద్ధమైన తెలంగాణ ఫైర్‌బ్రాండ్.. వర్కవుట్ అయ్యేనా..!?

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) అసెంబ్లీ నియోజకర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకర్గంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని (Kodali Nani) గెలిచి నిలిచారు. అయితే.. రానున్న ఎన్నికల్లో నానిపై పోటీచేయడానికి తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌గా (Telangana Firebrand) పేరుగాంచిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) రె‘ఢీ’ అవుతున్నారు. ఈ మధ్య పదే పదే కొడాలి నానిపై విమర్శలు గుప్పించడం, సవాళ్లు విసురుతున్న రేణుకా ఇప్పుడు ఏకంగా ఆయనపై పోటీచేస్తానని తేల్చిచెప్పేశారు.

ఇలా బయటికొచ్చింది..

ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కలా రియాక్ట్ అయ్యారు. వీరిలో ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు. నానిపై, వైసీపీపై (YSR Congress) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రేణుకా చౌదరి. నాటి నుంచి నానిపై కోపం పెంచుకున్న రేణుకా.. ఆయన నియోజకవర్గానికి వెళ్లి పాగా వేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ ప్రజల నుంచి ఆమెకు ఆహ్వానం వచ్చింది. దీంతో ఇక గుడివాడ నుంచి.. అది కూడా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నానిపై పోటీచేయాలని నిర్ణయానికి వచ్చేశారు. సోమవారం నాడు మీడియా ముఖంగా తన మనసులోని మాటను బయటపెట్టారు రేణుకా.

రెండు చోట్లా పోటీ..

ఏపీలో పోటీచేసి.. తెలంగాణ వదిలేయనని అవసరమైతే రెండు చోట్లా పోటీచేస్తానని కూడా చెప్పారు. ఖమ్మం (Khammam), గుడివాడ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేస్తానని చెప్పారు ఫైర్‌బ్రాండ్. అయితే.. ఖమ్మం ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఈమె.. ఏపీలో అది కూడా కొడాలి నాని అడ్డాలో ఏ మాత్రం ప్రభావం చూపిస్తారన్నది వేచి చూడాలి. సామాజిక వర్గం కలిసొస్తుందని రేణుకా బాగా లెక్కలేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే.. ప్రత్యర్థి కూడా అదే సామాజిక వర్గమే.. అదే వర్గం ఎవరిని అక్కున చేర్చుకుంటుంది.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి.

ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పొచ్చు.. సీజన్ టైమ్‌లో మనసులూ మారచ్చు.. అప్పటి వరకూ ఇదే విషయం రేణుకా మనసులో ఉంటుందో.. లేదో అనేది చూడాలి. అయితే రేణుకా కామెంట్స్ చూసిన చాలా మంది చిత్రవిచిత్రాలుగా తమ అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే పోటీచేస్తే ఏ పార్టీ తరఫున పోటీచేస్తారు..? ఏ మేరకు ఓట్లు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2023-02-06T22:56:08+05:30 IST