YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

ABN , First Publish Date - 2023-02-07T19:34:15+05:30 IST

రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) జైలుకెళ్తారు.. ఆయన సోదరి వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister)...

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

హైదరాబాద్/జనగామ : రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) జైలుకెళ్తారు.. ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister) అవుతారని జోస్యం చెప్పారు తెలంగాణ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiyam Srihari). ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఆమె ఏ ప్రాంతంలో పాదయాత్ర (YS Sharmila Padayatra) చేపట్టినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలపై (BRS Leaders) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (TS Budget) గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

ఇందుకు కౌంటర్‌గా కడియం శ్రీహరి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. బడ్జెట్‌పై షర్మిల చేసిన కామెంట్స్ బాధాకరమన్నారు. వైస్ కుటుంబం (YS Family) మొదట్నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందన్నారు. సమైక్యాంద్రే తమ నినాదం అని ఊరూర తిరిగిన వ్యక్తి షర్మిల అని ఈ సందర్భంగా కడియం గుర్తు చేశారు. అంతేకాదు.. పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను కూడా శ్రీహరి ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించారు.

Kadiyam-Sreehari-1.jpg

కడియం కామెంట్స్ ఇవీ..

‘ అవును.. నిజంగానే షర్మిలకు రాజకీయంగా అన్యాయం జరిగింది. వైఎస్ జగన్ సీబీఐ కేసులో (CBI Case) జైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మలు (Sharmila, Vijayamma) పాదయాత్రలు చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. తల్లీ, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారు. మీకష్టంతో అధికారంలోకి వచ్చి మీకు అన్యాయం చేశారు. షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలి. రేపో మాపో సీబీఐ కేసులోనో, వివేకానందరెడ్డి హత్య (Viveka Murder Case) కేసులోనో వైఎస్ జగన్ జైలుకు పోతే షర్మిలకు సీఎం అయ్యే అవకాశం వస్తుంది. అనవసరంగా తెలంగాణలో తిరిగి సమయాన్ని వృధా చేసుకోకు. షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతికత లేదు. ఏపీలో జగన్ గ్రాఫ్ (Jagan Graph) పడిపోతోంది’ అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.

Kadiyam-Sreehari-3.jpg

రియాక్షన్ ఎలా ఉంటుందో..!

వాస్తవానికి.. వైసీపీపై ఎలాంటి కామెంట్స్ చేసినా ఏపీ (Andhra Pradesh) నుంచి కూడా అంతేరీతిలో రియాక్షన్ కూడా వస్తోంది. ఇప్పుడు ఏకంగా జగన్ జైలుకెళ్తారు.. గ్రాఫ్ పడిపోయిందని కడియం చేసిన కామెంట్స్‌పై ఎలాంటి కౌంటర్లు వస్తాయో మరి. ఇటు వైఎస్ షర్మిల కూడా తనపై కామెంట్స్ ఎవరూ చేసినా సరే.. ఎంత పెద్దోళ్లయినా లెక్కచేయకుండా తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్యనే ప్రజాసమస్యలపై తనతో కలిసి నడవాలని సీఎం కేసీఆర్‌కే ఒక జత బూట్లు ప్రగతిభవన్‌కు పంపించారు. మరి కడియం కామెంట్స్‌పై షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది వేచి చూడాలి.

Kadiyam-Sreehari.jpg

******************************************

ఇవి కూడా చదవండి..

******************************************

MLA purchase Case: సుప్రీంకే వెళ్లండి!


******************************************

BRS MLAs Poaching Case: హైకోర్టు తీర్పుపై సుప్రీమ్‌కు వెళ్లాలని సిట్ నిర్ణయం

******************************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ

Updated Date - 2023-02-07T20:25:35+05:30 IST