YSRCP : వైసీపీకి షాకిచ్చిన కీలక నేత.. రాజీనామా చేసి టీడీపీలో చేరిక.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-05T21:42:18+05:30 IST

వైసీపీలో (YSRCP) గత నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలు పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు అసంతృప్తి గళం వినిపించడం..

YSRCP : వైసీపీకి షాకిచ్చిన కీలక నేత.. రాజీనామా చేసి టీడీపీలో చేరిక.. అసలేం జరిగిందంటే..

అమరావతి/కాకినాడ : వైసీపీలో (YSRCP) గత నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలు పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు అసంతృప్తి గళం వినిపించడం.. మరోవైపు ద్వితియ శ్రేణి నేతలనుంచి ఎమ్మెల్యేలకు (MLAs) షాక్‌లు వస్తుండటంతో అసలు అధికార పార్టీలో ఏం జరుగుతోందో అధిష్టానానికి అర్థం కాని పరిస్థితి. నిన్న, మొన్నటి వరకు ఎమ్మెల్యేలు రెబల్స్‌‌గానే (Rebals) మారారు అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేల రైట్ హ్యాండ్‌గా చెప్పుకునే ప్రధాన అనుచరులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా (Resignation) చేసి పార్టీ నుంచి బయటికొచ్చేయగా.. తాజాగా కాకినాడకు (Kakinada) చెందిన ఓ కీలక నేత వైసీపీకి (YSR Congress) రాజీనామా చేశారు.

Cgh.jpg

రాజీనామా వెనుక..

జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు (MLA Chantibabu) ముఖ్య అనుచరుడు షాకిచ్చారు. ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్‌గా, ప్రధాన అనుచరుడిగా ఉన్న వైబోగుల శ్రీనివాస్ (Vybogula Sreenivas) వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సొంత మండలమైన జగ్గంపేటలోనే (Jaggampeta) టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru), జ్యోతుల నవీన్ కుమార్ (Naveen Kumar) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు ద్వితియశ్రేణి వైసీపీ నేతలు టీడీపీ (Telugudesam) కండువా కప్పుకున్నారు. యాదవ సంఘం అంతా చంద్రబాబుకు ఉంటుందని శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. అయితే నియోజకవర్గంలో శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించేవారని.. చంటిబాబు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారని స్థానిక నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో కీలక నేత అయిన వైబోగుల పార్టీని వీడటం ఎమ్మెల్యేకు గట్టి షాకేనని.. రానున్న ఎన్నికల్లో ప్రభావమేంటో తెలుస్తుందని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. ఇదే కాకినాడలో గొల్లప్రోలు మండలం కొడవలిలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో భారీగానే చేరికలు జరిగాయి. సుమారుగా వైసీపీకి చెందిన 50 మంది ముఖ్య కార్యకర్తలు YCPకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.

Chanti-and-nehru.jpg

మొత్తానికి చూస్తే.. ఇప్పుడిప్పుడే వైసీపీకి మొదలైన షాక్‌లు ఎలక్షన్ సీజన్ వచ్చేసరికి ఊహించని రీతిలో చేరికలు జరిగినా జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని వైసీపీ అధిష్టానం ఎలా చక్కబెడుతుందో.. ఈ పరిణామాలన్నింటినీ టీడీపీ ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి మరి.

Updated Date - 2023-02-05T21:57:25+05:30 IST