YSRCP : చంద్రబాబుతో రహస్య భేటీ.. టీడీపీలో చేరికపై ఒక్క ప్రెస్‌మీట్‌తో తేల్చేసిన వైసీపీ ఎంపీ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-06T19:15:33+05:30 IST

అదుగో.. ఫలానా వైసీపీ ఎంపీ (YSRCP MP) అధికార పార్టీకి గుడ్ బై (Good Bye) చెప్పేస్తున్నారు..! ఎన్నికల ముందు (Election) టీడీపీ తీర్థం (TDP) పుచ్చుకోబోతున్నారు..! ..

YSRCP : చంద్రబాబుతో రహస్య భేటీ.. టీడీపీలో చేరికపై ఒక్క ప్రెస్‌మీట్‌తో తేల్చేసిన వైసీపీ ఎంపీ.. అసలేం జరిగిందంటే..

అమరావతి/న్యూ ఢిల్లీ : అదుగో.. ఫలానా వైసీపీ ఎంపీ (YSRCP MP) అధికార పార్టీకి గుడ్ బై (Good Bye) చెప్పేస్తున్నారు..! ఎన్నికల ముందు (Election) టీడీపీ తీర్థం (TDP) పుచ్చుకోబోతున్నారు..! పార్టీ మారిన తర్వాత అదే పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా (MP) కూడా పోటీ చేయబోతున్నారు..! ఇందులో భాగంగానే టీడీపీ ఎంపీలతో (TDP MPs) మొదటి భేటీ అయ్యి ఆ తర్వాత వారితో కలిసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును (Chandrababu) కలిశారు..! ఇవీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో (Social Media) వేదికగా పెద్ద ఎత్తున వస్తున్న రూమర్స్ (Rumours). దీనిపై ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో (Twitter, Facebook) వైసీపీ వర్సెస్ టీడీపీగా (YSRCP Vs TDP) కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా గుప్పించుకున్నారు. సరిగ్గా ఈ వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాల (Nellore Politics) తర్వాత బయటికి రావడంతో పార్టీలో అసలేం జరుగుతోంది..? అని అధిష్టానమే ఆలోచనలో పడినంత పనైంది. ఇంకోవైపు.. ఎంపీ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఇదేంటి ఉన్నట్లుండి ఇలా జరుగుతోందని ఆందోళన చెందారు. ఇప్పటి వరకూ ఈ రూమర్స్‌పై ఒక్కసారి కూడా స్పందించని ఆ ఎంపీ.. ఇక ఆలస్యం చేస్తే అసలుకే ఎసరొచ్చేలా ఉందని మీడియా ముందుకొచ్చేసి వివరణ ఇచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ..? ఈ రూమర్స్‌లో నిజానిజాలెంత..? వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది..?

విజ్జాన్ విద్యాసంస్థల (Vignan institutes ) అధినేత డాక్టర్ లావు రత్తయ్య (lavu rathaiah) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు (Telugu States) ప్రత్యేకించి మరీ చెప్పక్కర్లేదు. ఈయన విద్యా సంస్థలను నడపడంలో గ్రాండ్ సక్సెస్ అయినా.. రాజకీయాలు (Politics) మాత్రం అంతగా కలిసిరాలేదు. అయితే.. రత్తయ్య కుమారుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో లావు శ్రీకృష్ణదేవరాయలుకు (lavu sri krishna devarayalu ) నరసారావుపేట (Narasaraopet) ఎంపీ టికెట్‌ను (MP Ticket) ఇచ్చారు వైఎస్ జగన్ (YS Jagan). ఎంపీ అభ్యర్థిగా గెలవడమే కాదు.. ఈయన పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీనే (YSR Congress) గెలిచింది. అలా యువ ఎంపీ (Young MP) పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీలోనూ మార్మోగింది. అంతా ఓకే కానీ.. ఈ మధ్య ఎందుకో టీడీపీకి ఈయన దగ్గరవుతున్నారని వార్తలు వినిపించాయి. అంతేకాదు.. గతేడాది టీడీపీ ఎంపీలతో కలిసి ఫొటోలు దిగడం పెద్ద చర్చకే దారితీసింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే టీడీపీలో చేరుతున్నారని.. ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుతో కూడా రహస్యంగా కలిశారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. ఇదే నరసారావుపేట నుంచి టీడీపీ తరఫునే పోటీచేస్తారని కూడా రూమర్స్ వినిపించాయి. వాస్తవానికి ఈయన పార్లమెంట్ పరిధిలోని ఒకరిద్దరి ఎమ్మెల్యేలతో మొదట్నుంచీ పడట్లేదు. దీనికి తోడు టీడీపీలో చేరుతున్నారనే రూమర్స్ రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

MP-Laavu-2.jpg

క్లారిటీ వచ్చేసింది..!

గత కొన్నిరోజులుగా నరసారావుపేటలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, తనపై వస్తున్న రూమర్స్‌కు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ మీడియా ముందుకొచ్చారు. ఒక్క ప్రెస్‌మీట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘నేను టీడీపీ అధినేత చంద్రబాబును కలవలేదు. టీడీపీలో ఇతర నేతలను కూడా కలవలేదు. చంద్రబాబును (NCBN) కలిసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ విషయంపై నన్ను కలిసిన వారు వచ్చి చెప్పినా ఓకే.. నిరూపించండి. అనవసర విషయాలపై కొన్ని మీడియా (Media) సంస్థలు అతిగా ప్రచారం చేసి ప్రజల సమయం వృథా చేయొద్దు. నేను ఎవరిని కలిసినా ప్రజలకు చెబుతాను.. ఆ విషయం దాచాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రజల సమస్యలు తీర్చడానికే ఎంపీ అయ్యాను కానీ.. మీడియాలో పదే పదే కనిపించడానికి కాదు. అంతకుమించి ప్రచారం కోసం కానే కాదు’ అని శ్రీకృష్ణదేవరాయలు వివరణ ఇచ్చుకున్నారు.

MP-Laavu-3.jpg

మొత్తానికి చూస్తే.. ఒక్క ప్రెస్‌మీట్‌తో అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల్లో నెలకొన్న వంద అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశారు ఎంపీ. ఇకనైనా యువ ఎంపీ ఇలాంటి రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడతాయో లేకుంటే కంటిన్యూ అవుతూనే ఉంటాయో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి..

YSRCP : వైసీపీకి షాకిచ్చిన కీలక నేత.. రాజీనామా చేసి టీడీపీలో చేరిక.. అసలేం జరిగిందంటే..


Ponguleti : అభిమానుల సాక్షిగా పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పొంగులేటి.. అంతా సరే కానీ..!

Updated Date - 2023-02-06T19:56:49+05:30 IST