YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

ABN , First Publish Date - 2023-02-08T21:37:13+05:30 IST

అవును.. ఇద్దరు మంత్రులకు (Two Ministers) సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రత్యేకంగా పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. మీ తీరు మార్చుకోకపోతే ఇక అస్సలు ఊరుకునేది లేదని సీరియస్ వార్నింగ్..

YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

అవును.. ఇద్దరు మంత్రులకు (Two Ministers) సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రత్యేకంగా పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. మీ తీరు మార్చుకోకపోతే ఇక అస్సలు ఊరుకునేది లేదని సీరియస్ వార్నింగ్ (Serious Warning) కూడా ఇచ్చేశారు సీఎం. ఇద్దరినీ కూర్చోబెట్టి అరగంటపాటు మాట్లాడి స్ట్రాంగ్‌గానే ఇచ్చారు. సీఎం మాట్లాడుతున్నంత సేపు మంత్రుల నోట ఒక్కమాట కూడా రాలేదట. జగన్ ఇంతలా సీరియస్ అయ్యేలా మంత్రులు ఏం చేశారు..? అసలు ఆ ఇద్దరు మంత్రులు ఎవరు..? ఏ ప్రాంతాలకు చెందినవారు..? ఎప్పుడూ లేనంతగా ఎందుకిలా హెచ్చరించారు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఆ ఇద్దరు వీరే..

వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్న ఇద్దరు మంత్రుల్లో ఒకరు కోస్తాంధ్రకు (Coastal Andhra) చెందిన వారు కాగా.. మరొకరు రాయలసీమకు (Rayalaseema) చెందిన మహిళా మంత్రి. వీరిద్దరూ కూడా మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న వారే. గత కొన్నిరోజులుగా వీరి పనితీరు.. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది..? అనేదానిపై వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక నివేదికలు (Special Reports) అందాయి. దీంతో బుధవారం నాడు కేబినెట్ భేటీ (Cabinet Meeting)అవ్వగానే.. బయటికి వెళ్తుండగా ప్రత్యేకంగా క్యాబిన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు. మీకు కేటాయించిన శాఖలు.. మీ మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మాని అనవసరంగా పక్క నియోజకవర్గాల్లో మీకేం పని..? అని కన్నెర్రజేశారు. మంత్రులు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా ప్రస్తావించి మరీ గట్టిగా హెచ్చరించారు. అసలు పక్క నియోజకవర్గాల్లో తల దూర్చాల్సిన అవసరమేంటి..? అని అర్దగంటపాటు తలంటారు జగన్.

Jagan-Cabinet.jpg

కోస్తా మంత్రి వ్యవహారం ఇదీ..!

కోస్తాంధ్రకు చెందిన మంత్రికి.. ఓ ఎమ్మెల్యేకు (Minister Vs MLA) అస్సలు పడట్లేదు. మంత్రి అస్తమాను పక్క నియోజకవర్గం విషయాల్లో తలదూర్చడం, అనుచరులతో హడావుడి చేయించడంతో ఈ మధ్య ఇటు మీడియాలో (Media).. అటు సోషల్ మీడియాలో (Social Media) పేరు మార్మోగిపోయింది. ఎక్కడ చూసినా ఈయన గురించే చర్చ నడిచింది. దీంతో ఈ వ్యవహారానికి ఆదిలోనే ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించిన జగన్.. ఇందులో నిజానిజాలెంత..? అని ఎమ్మెల్యేను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారట. మరోవైపు సీఎంవోకు కూడా పక్కాగా నివేదిక రావడంతో ఇక ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయారు జగన్. ఇకపై పక్క నియోజకవర్గంలో తలదూర్చినట్లు తెలిస్తే మాత్రం అస్సలు సహించేదే లేదని స్ట్రాంగ్‌గా చెప్పేశారట. అరగంటపాటు జగన్ క్లాస్ తీసుకున్నాక.. అప్పటివరకూ సైలెంట్‌గానే ఉన్న మంత్రి ‘అన్నా.. అదేం లేదన్నా.. ఇక నా పనేదే నేను చేసుకుంటాను’ అని జవాబిచ్చారట. సమస్యలు ఏమున్నా మంత్రిగా డైరెక్టుగా కలవొచ్చుగా వార్తల్లోకెక్కడం అంత సరదానా..? అని చివరిగా చెప్పి క్యాబిన్ నుంచి పంపారట జగన్.

YS-Jagan-Warning.jpg

రాయలసీమ మంత్రి కథ ఇదీ..

ఎవరూ ఊహించని రీతిలో ఫస్ట్ టైమ్ మంత్రి (First Time Minister) పదవి దక్కించుకున్నారు. పదవి దక్కింది కదా అని చక్కగా ఇచ్చిన బాధ్యతలు చూసుకోకుండా.. అనవసరపు పనులు ఎక్కువయ్యాయని జగన్‌కు సమాచారం వచ్చింది. ఈ మధ్య మంత్రిపై భూతగాదాల ఆరోపణలు రావడం, లేనిపోని విషయాల జోలికి వెళ్తున్నారని ఆ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రి సొంత మనుషులే జగన్‌కు ఫిర్యాదు చేశారట. మరోవైపు.. ఈ మంత్రి గురించి ప్రధాన దినపత్రికల్లో సైతం బ్యానర్ వార్తలూ వచ్చాయి. ఇలాగైతే కష్టమని బుధవారం నాడు జగన్ చెప్పాల్సింది చెప్పేశారట. ‘అవన్నీ అసత్య ఆరోపణలే సార్..’ అని జగన్ మాట్లాడుతుండగానే మధ్యలో జోక్యం చేసుకుని మంత్రి చెప్పబోయారు. ‘నాకు అన్నీ తెలుసమ్మా.. ఆధారాలతోనే మాట్లాడుతున్నా’ అని జగన్ సున్నితంగా హెచ్చరించారట. జగన్ ఆ మాట అనడంతో ఇక చెప్పడానికి ఏమీలేక మౌనంగా వెళ్లిపోయారట మంత్రి.

Cabinet-1.jpg

ఇదీ.. ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత జరిగిన కథ. జిల్లా ఇంచార్జ్‌ మంత్రులను (Incharge Minister) కూడా కాదని డైరెక్టుగా సీఎం జగనే ఇలా క్లాస్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.. అలాంటిది ఆ ఇద్దరు తీరు మార్చుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా దాదాపు వారికి ఫుల్ క్లారిటీ వచ్చేసే ఉంటుందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ క్లాస్ తర్వాత అయినా ఆ ఇద్దరు మంత్రుల్లో మార్పు వస్తుందా.. అబ్బే అదేముందిలే అని యథావిధిగా అటు.. ఇటు తలదూర్చుతారో వేచి చూడాలి మరి.

*************************

ఇవి కూడా చదవండి..

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

*************************


KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

*************************

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

*************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

*************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

*************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

*************************

Updated Date - 2023-02-08T22:18:09+05:30 IST