KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

ABN , First Publish Date - 2023-02-08T16:26:59+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కలకలం సృష్టించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

అమరావతి/నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కలకలం సృష్టించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆధారాలతో (Proofs) సహా మీడియా ముందు బయటపెట్టిన కోటంరెడ్డి.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు (Amit Shah) కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమేంటి..? ఏ విషయంలో ట్యాపింగ్ జరిగింది..? దీనికి కారకులు ఎవరు..? ఏ విషయం మాట్లాడుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది..? ఇద్దరూ మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ చేసిందెవరు..? అసలు అది ఫోన్ ట్యాపింగా.. రికార్డింగా..? అనే విషయాలను కోటంరెడ్డి చిన్ననాటి స్నేహితుడు లంకా రామశివారెడ్డి (Lanka Ramasivareddy) పూసగుచ్చినట్లుగా మీడియాకు వివరించారు. లంకా చెప్పిన వ్యాఖ్యలపై ప్రత్యేక కథనం.

అసలేం జరిగింది..?

నేను.. (లంకా రామశివారెడ్డి) శ్రీధర్ రెడ్డి చిన్ననాటి స్నేహితులం (Best Friends). రెండు సార్లు శ్రీదర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే (Rural MLA) అయినప్పుడు నేను ఎంతో సంతోషించాను. నేను.. శ్రీధర్‌రెడ్డి అనేక సార్లు ఫోన్‌లో పలు విషయాలపై మాట్లాడుకున్నాము. శ్రీధర్‌రెడ్డి కలెక్టరేట్‌ మీటింగ్‌లో మాట్లాడినప్పుడు నేను అంతా చూశాను. అదే రోజు నాకు శ్రీధర్‌రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాను. నా ఆభిప్రాయాన్ని శ్రీధర్‌రెడ్డి పరిగణనలోనికి తీసుకోలేదుఅని కోటంరెడ్డి మిత్రుడు మీడియాకు వివరించారు.

Kotam.jpg

ఏ విషయంపై చర్చ జరిగింది..?

నెల్లూరు జిల్లాకు (Nellore District) చెందిన ఓ కాంట్రాక్టర్ గురించి ఎమ్మెల్యే నాతో చాలాసేపు చర్చించారు. ఆ విషయం నా ఫోన్‌లో ఆటోమేటిక్‌గా రికార్డ్ అయ్యింది. నాది ఆండ్రాయిడ్ ఫోన్ కావడంతో ఫోన్‌లో ప్రతీకాల్ రికార్డ్ (Phone Call Record) అవుతుంది. నాది ఐఫోన్ (Iphone) అని కోటంరెడ్డి చెప్పిన మాట అవాస్తవం. అయితే నేను.. మా కాంట్రాక్టర్ల చర్చ వచ్చినప్పుడే కోటంరెడ్డి ఆడియో బయటపెట్టాను. శ్రీధర్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని నేను ఈపని చేయలేదు. దీన్ని శ్రీధర్‌రెడ్డి షోన్ ట్యాపింగ్ అనడం.. ఇంత అలజడి జరుగుతుందని నేను అనుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తోందని అనుకోలేదుఅని రామశివారెడ్డి చెప్పుకొచ్చారు.

Phone-Tapping.jpg

ఇప్పుడే ఎందుకు..?

శ్రీధర్‌రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అన్న తర్వాతే నేను బయటికి రావాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారు (CM YS Jagan Mohan Reddy) ఆరోపణలు ఎదుర్కోవడం ఇష్టం లేక నేను మీడియా ముందుకొచ్చాను. నేను ఎవరో సీఎంకు అసలు తెలియదు. ఏదేదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో నా స్నేహితుడుని ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఎమ్మెల్యే అంటున్నట్టు నన్ను ఎవరు ప్రభావితం చేయలేదు.. అంతకుమించి ఎవరి ఒత్తిడీ నాపై లేదు. నేను ఇప్పుడు ఆ ఆడియో డిలీట్ చేశాను. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్‌ ఎవరనే విషయం నేను బయటపెట్టను. దర్యాప్తు సంస్థలు అడిగితే మాత్రం కచ్చితంగా వివరాలు బయటపెడుతాను. నా ఫోన్ ఫోరెన్సిక్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అసలేం జరిగిందో చెప్పడానికి నేను ఇవాళ మీడియా ముందుకు వచ్చానుఅని రామశివారెడ్డి మీడియా ముందు వెల్లడించారు.

Ram-Sivareddy.jpg

చూశారుగా.. ఇదీ కోటంరెడ్డి బాల్యమిత్రుడు పూసగుచ్చినట్లు చెప్పిన కాల్ రికార్డింగ్ కథ. ఇప్పటి వరకైతే ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను దాటి ఢిల్లీ దాకా కూడా చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కోటంరెడ్డి ఏం చేయబోతున్నారు..? కోటంరెడ్డి ఫిర్యాదుపై కేంద్ర హోం శాఖ ఏం తేలుస్తుంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు రామశివారెడ్డి ఆరోపణలపై కోటంరెడ్డి మొదట ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సిన విషయమే.

*************************

ఇవి కూడా చదవండి..

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

*************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

*************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

*************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

*************************

Updated Date - 2023-02-08T17:21:15+05:30 IST