YS Jagan : శభాష్ అంటూ ముగ్గురు మంత్రులను మెచ్చుకున్న వైఎస్ జగన్.. అందులో ఒకరు...!

ABN , First Publish Date - 2023-02-08T22:52:03+05:30 IST

ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఇద్దరు మంత్రులను (AP Ministers) క్లాస్ తీసుకుని సీరియస్ వార్నింగ్ (Serious Warning) ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. (YS Jagan) మరో ముగ్గురు మంత్రులను శభాష్ అని మెచ్చుకున్నారు.

 YS Jagan : శభాష్ అంటూ ముగ్గురు మంత్రులను మెచ్చుకున్న వైఎస్ జగన్.. అందులో ఒకరు...!

ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఇద్దరు మంత్రులను (AP Ministers) క్లాస్ తీసుకుని సీరియస్ వార్నింగ్ (Serious Warning) ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. (YS Jagan) మరో ముగ్గురు మంత్రులను శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందులో ఒకరు యంగ్ మినిస్టర్, ఇంకొకరు సీనియర్ మంత్రి.. మరొకరు మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్నవారు. జగన్ మెచ్చుకోవడంతో ఆ ముగ్గురు మంత్రుల్లో ఒకరైన యంగ్ మినిస్టర్ ఆనందానికి హద్దుల్లేవట. ఇంతకీ ఆ ముగ్గురు మంత్రులు ఎవరు..? ఏయే శాఖలకు వారు మంత్రులు..? వారిని మెచ్చుకునేలా ఏం చేశారు..? అనే విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

YS-Jagan-Warning.jpg

వీరే.. ఆ ముగ్గురు..!

జగన్ మెచ్చుకున్న ముగ్గురు మంత్రులు మరెవరో కాదండోయ్.. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ (Botcha satyanarayana), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (Karumuri Venkata Nageswara Rao), విడదల రజినీ (Vidadala Rajini). ఈ ముగ్గుర్నీ కేబినెట్ మీటింగ్‌లోనే శభాష్ అని మెచ్చుకున్నారు. బొత్స విషయానికొస్తే.. కేబినెట్ విస్తరణ తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈయన మొదట్లో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలకు పరిష్కారం చూపుతూ ముందుకెళ్లారని జగన్ చెప్పారట. ఇప్పుడు అంతా సద్దుమణిగిందని ఇలాగే కంటిన్యూ చేయాలని జగన్ మెచ్చుకున్నారు. ‘సీనియర్‌గా మీకు ఉన్న అనుభవంతో మంచి మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యారంగంలో మంచి ఫలితాలు వచ్చాయి’ అని బొత్సను అభినందించారట జగన్.

YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!


Jagan-Cabinet.jpg

మిగతా వారి విషయానికొస్తే..

ఫస్ట్ టైమ్ మంత్రి అయినా విడదల రజినీ వైద్య ఆరోగ్యశాఖకు వందకు వంద శాతం న్యాయం చేశారని జగన్ మెచ్చుకున్నారట. ఆశించిన దానికంటే ఎక్కవగానే పనిచేస్తున్నారని.. ఇలానే ముందుకెళ్లండని రజినీకి సూచించారట. ఇక పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి గురించి మరోమంత్రి దాడిశెట్టి రాజా.. జగన్‌కు చెప్పారట. ‘ అవును ధాన్యం కొనుగోలు విషయంలో చాలా బాగా పనిచేశారు. మొదటి ఈ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చినా మీ సీనియార్టీని వాడి అంతా సెట్ చేశారు’ అని కారుమూరిని కూడా జగన్ మెచ్చుకున్నారట.

Ministers.jpg

మొత్తానికి చూస్తే.. ఒక కేబినెట్ సమావేశంతో ఇటు ఇద్దరు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం.. అటు ముగ్గురు మంత్రులను మెచ్చుకోవడం ఒకే రోజు జరిగింది. తమను మెచ్చుకున్నారని ముగ్గురు మంత్రులు, వారి అనుచరులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక వార్నింగ్ ఇప్పించుకున్న మంత్రులు మాత్రం దిగాలుగానే ఉండిపోయారట. మరి మున్ముందు ఈ పరిస్థితుల్లో ఎంతవరకూ మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే.

*************************

ఇవి కూడా చదవండి..

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

*************************


KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

*************************

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

*************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

*************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

*************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

*************************


Updated Date - 2023-02-08T23:06:37+05:30 IST