అలర్ట్.. మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:22 PM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు (AP Rain Alert) కురుస్తాయని తెలిపారు. దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కోనసాగుతుందని తెలిపారు.
వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ క్రమంలో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా విజయనగరం, ఎస్ కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు కూడా చదవండి...
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు
జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్
లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News