రెయిన్ అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:21 PM
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణీ విస్తరించిందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణీ విస్తరించిందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో అత్యధికంగా తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News