అక్వాన్ ప్రభావం.. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీల వేగంతో కదులుతున్న తుపాను
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:50 PM
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని తెలిపారు.
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని తెలిపారు. ప్రస్తుతానికి ఇది చెన్నైకు 570 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 590 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 580 కిలోమీటర్లు, పూరీకి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చారు. ఇది ఎల్లుండి (శుక్రవారం) మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య, ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపానుగా దాటే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి100 కిలోమీటర్లు, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రఖర్ జైన్ చెప్పారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాను పయనంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తుపాను గమనంపై ఎప్పటికప్పుడూ జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు జారీ చేశామని అన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF), స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు
బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News