ద్రోణి ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:54 PM
బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని తెలిపారు.
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గురువారం (నవంబర్ 26) పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రేపు (గురువారం) కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరుగా వానలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి (శుక్రవారం) రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించారు. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల వరకు తిరుపతి జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 45.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు. నెల్లూరు జిల్లా అల్లంపాడులో 41.5 మిల్లీమీటర్లు, గూడూరులో 32.7 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా వాకాడులో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందని చెప్పుకొచ్చారు. విడవలూరులో 32 మిల్లీమీటర్లు, పెన్నేపల్లెలో 30 మిల్లీమీటర్లు, మొలకలపుండ్లలో 28 మిల్లీమీటర్లు, నెల్లూరులో 23.2 మిల్లీమీటర్లు, భీమవరంలో 22.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News