Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్

ABN , Publish Date - Oct 09 , 2026 | 08:50 PM

ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్
AP Weather Alert

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.


ఇది తదుపరి 3 నుంచి 4 రోజుల్లో బలపడి, పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు-దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఇది బుధవారానికి వాయుగుండంగా మారవచ్చని కొన్ని వాతావరణ మోడల్స్ వెల్లడించాయని.. అల్పపీడనంగానే కొనసాగుతుందని మరికొన్ని మోడల్స్ అంచనా వేశాయని చెప్పారు. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్

భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్

హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 09:12 PM