Share News

ఏపీకి వర్ష సూచన.. తుఫాన్‌గా బలపడనున్న అల్పపీడనం

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:41 PM

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపడినం కాస్తా, తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపారు.

 ఏపీకి వర్ష సూచన.. తుఫాన్‌గా బలపడనున్న అల్పపీడనం
AP Rains Alert

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపడినం కాస్తా, తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపారు. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈరోజు వాయుగుండంగా మారే ఆవకాశం ఉందని వివరించారు.


ఇది పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 25వ తేదీన తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 26వ తేదీన ఉదయానికి పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అక్టోబర్ 28వ తేదీన ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఉన్న పశ్చిమ - మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 05:53 PM