Share News

రెయిన్ అలర్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

ABN , Publish Date - Jun 17 , 2026 | 02:50 PM

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.

రెయిన్ అలర్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
AP Rains Alert

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వివరించారు. వర్షాల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని చెప్పుకొచ్చారు. ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని హెచ్చరించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు

మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 02:59 PM