Share News

రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 07:19 AM

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.

రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Andhra Pradesh Rain Alert

అమరావతి, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతం ఉత్తర అండమాన్‌ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరో మూడురోజుల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఇది ఉత్తరకోస్తా దిశగా కదిలి ఈ నెల 23వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వానలు పడతాయని చెప్పుకొచ్చారు.


ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దాంతో పాటు ఈదురుగాలుల వీచే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 08:10 AM