వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

ABN, Publish Date - Sep 06 , 2026 | 03:23 PM

కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ నిశ్చయ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి వివాహం జరగనుంది.

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన కూతురు అంజలి రెడ్డి వివాహం ఖరారైనట్లు ఎక్స్(X) వేదికగా షర్మిల ప్రకటించారు. అమెరికాలో నివసిస్తున్న డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో పెళ్లి నిశ్చయించినట్లు ప్రకటించారు.


కర్నూలు జిల్లాకు చెందిన సోమల సిద్ధారెడ్డి - పద్మ దంపతుల కుమారుడు డాక్టర్ రఘురామ్ రెడ్డితో ఈ కల్యాణం జరిపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఉన్న పెళ్లి వార్తను షర్మిల షేర్ చేస్తూ, తమకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదమని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు

నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్

గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Sep 06 , 2026 | 03:55 PM