ఎస్‌ఈసీపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 18 , 2026 | 04:01 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఎస్‌ఈసీను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (ఆదివారం) భేటీ అయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. ఎస్‌ఈసీను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క అభ్యర్థి అయినా నామినేషన్ వేయలేకపోతే ఆ అపకీర్తి ఎస్‌ఈసీకే దక్కుతుందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు ఎస్కార్ట్ కల్పించి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయించాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సెంట్రల్ పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాలని ఎస్‌ఈసీకి జగన్ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Oct 18 , 2026 | 04:07 PM