నేటి నుంచే పసుపు పండుగ
ABN, Publish Date - May 27 , 2026 | 08:33 AM
తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.
తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మహానాడు వేదికగా.. వచ్చే ఎన్నికలకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకోవడంపై టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టనుంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోనున్నారు.
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, ఉమ్మడివి 4, అండమాన్ నుంచి 1, కీలకమైన రాజకీయ తీర్మానాలు ఉంటాయి. ఈ ఏడాది మహానాడును స్త్రీశక్తి థీమ్‌తో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రసంగాలన్నీ మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్త్రీశక్తిలో భాగంగా.. మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు.
Updated at - May 27 , 2026 | 08:33 AM