అమరావతికి మణిహారం.. ఓఆర్ఆర్ నిర్మాణానికి రంగం సిద్ధం

ABN, Publish Date - Nov 19 , 2026 | 10:25 AM

రాజధాని అమరావతికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా మరోమారు టెండర్లను ఆహ్వానించింది.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా మరోమారు టెండర్లను ఆహ్వానించింది. గతంలో 4 ప్యాకేజీలుగా ఉన్న ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ అప్రైజల్ కమిటీ (PPAC) సూచనల మేరకు 2 ప్యాకేజీలుగా కుదించి కొత్త టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు.


మొత్తం 189.93 కిలోమీటర్ల ప్రధాన రింగ్ రోడ్డుతో పాటు, గుంటూరును అనుసంధానించే 5.2 కిలోమీటర్ల రోడ్డుతో కలిపి ప్రాజెక్ట్ మొత్తం పొడవు 195 కిలోమీటర్లుగా ఉండనుంది. సర్వీస్ రోడ్లతో కలిపి ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.15,160 కోట్లుగా నిర్ణయించారు. కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేయడానికి జనవరి 15వ తేదీ వరకు గడువు విధించారు. తొలి ప్యాకేజీ (కంచికచర్ల - చలివేంద్రపాలెం), రెండో ప్యాకేజీ (ఉయ్యూరు - గుంటూరు మీదుగా కంచికచర్ల, కృష్ణా నదిపై రెండు ప్రధాన వంతెనలు) రూట్ మ్యాప్, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.


ఈ వార్తలు కూడా చదవండి...

ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ వేళ.. బాలయ్య ప్రశంసలు.!

ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. 145 కి.మీ వేగంతో బలమైన గాలులు..!

పంచాయతీ ఎన్నికలు.. ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 19 , 2026 | 10:44 AM