ఓట్ల చోరీ ఆరోపణలపై మౌనమేల సర్ జీ?!
ABN, Publish Date - Oct 11 , 2026 | 11:01 AM
ఓటర్ల జాబితా పరిశీలన పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆరోపణలపై కేంద్రప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించకపోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా పరిశీలన పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆరోపణలపై కేంద్రప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించకపోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. దేశంలో నిజానిజాలు తేల్చే వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం ఎలా కలగాలన్న ప్రశ్నను ప్రస్తావించారు. ఏది నిజం? ఏది అబద్ధం! అని ఎవరు చెప్పాలి? ఎవరి మాటలు నమ్మాలి? ఇంత పెద్ద దేశంలో ఏది సత్యమో? ఏది అసత్యమో? చెప్పగలిగే వ్యవస్థే లేదా? ప్రజలలో విశ్వాసం నింపగలిగే వ్యవస్థ ఒక్కటి కూడా మిగలలేదా? ప్రభుత్వాలకు భయపడుతూనో లేక ప్రభుత్వాలను తిట్టుకుంటూనో బతికేయాలా? ఓటర్ల జాబితా నిశిత పరిశీలన పేరిట ఓట్ల చోరీ జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం ఉందా? ఈ అంశంపై ప్రభుత్వంగానీ, ఎన్నికల కమిషన్‌గానీ ఎందుకు నోరు మెదపడం లేదు? ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతున్నప్పటికీ న్యాయ వ్యవస్థ సైతం ఎందుకు మౌనంగా ఉంటోంది?’ అని ఆర్కే ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
మంత్రి లోకేశ్ చొరవ.. ఆ పాఠశాలకు మహర్దశ
ఈ నెల 13న ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. ఎందుకంటే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Oct 11 , 2026 | 11:02 AM