తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:16 PM
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవడం పిల్లల బాధ్యత అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మహబూబాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవడం పిల్లల బాధ్యత అని మంత్రి సీతక్క (Minister Seethakka) వ్యాఖ్యానించారు. సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) మహబూబాబాద్‌లో మంత్రి సీతక్క పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అందించే పౌష్టికాహార పంపిణీని కచ్చితంగా పర్యవేక్షించేందుకు స్మార్ట్ ఫోన్లు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు, ఆహార పంపిణీ వివరాలు నమోదు చేసి పారదర్శకత పెంచుతామని చెప్పుకొచ్చారు. ఆరేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And International News And Telugu News