పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jul 31 , 2026 | 09:25 AM
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలను పలువురు నేతలు కొనియాడారు.
హైదరాబాద్, జులై 31 (ఆంధ్రజ్యోతి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపట్ల మంత్రి తుమ్మల సంతాపం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడి మరణం ఈ సమాజానికి తీరని లోటని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News