Share News

‘తూర్పు’లో ఆరని చిచ్చు

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:53 AM

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ పార్టీ, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది.

‘తూర్పు’లో ఆరని చిచ్చు
Konda Surekha

  • పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ

  • మంత్రుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శనలో కనిపించని వైనం

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికీ గైర్హాజరు

  • పార్టీ కార్యక్రమాలను విడిగా నిర్వహిస్తున్న కొండా అనుచరులు

వరంగల్‌: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ పార్టీ, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ అస్పత్రి నిర్మాణాన్ని గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు పరిశీలించారు.


ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆ స్పత్రిలో దసరా నుంచి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకరావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆస్పత్రి సందర్శనలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనగా, సొంత నియోజకవర్గ కార్యక్రమానికి కొండా సురేఖ దూరంగా ఉండటం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే సురేఖకు ఆహ్వనం లేకుండా మంత్రుల కార్యక్రమాన్ని నిర్వహించరని, అయితే సురేఖకు ఆహ్వనం ఉన్నప్పటికీ మంత్రులతో కలిసి పాల్గొనడం ఇష్టం లేకనే దూరంగా ఉన్నారా.. లేక సురేఖకు ఆహ్వనం ఇవ్వకుండానే ఆస్పత్రి సందర్శనకు మంత్రులు వచ్చారా అనేది హట్‌టాపిక్‌గా మారింది.


ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి..

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకు ని గురువారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌ హల్‌లో నిర్వహించిన ఉ మ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


hnk1.2.jpgఅయితే ఈ కార్యక్రమానికి కూడా సురేఖ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సరోత్తంరెడ్డి సైతం రెండు రోజుల క్రితమే హనుమకొండలోని సురేఖ ఇంటికి వెళ్లి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో కీలకమైన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశానికి సురేఖ దూరంగా ఉండటం ఏమిటనే చర్చ జరుగుతుంది.


ఇటీవల సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలు నిర్వహించింది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్‌ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి దూరంగా ఉన్న సురేఖ, మరుసటి రోజు తన అనుచరులతో కలిసి పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో నిరసన నిర్వహించారు. అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు అధికారికంగా మంత్రులు పాల్గొంటున్న కార్యక్రమాలకు సురేఖ దూరంగా ఉండటం కాంగ్రె్‌సలో విభేదాలు సమసిపోలేదనే టాక్‌ వినబడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

సగం మంది వెన్నునొప్పి బాధితులే..!

బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 12:09 PM