Share News

లండన్‌ వీధిలో స్పృహ కోల్పోయిన రాజకుటుంబ సభ్యురాలు.. కోర్టు చర్యలు.!

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:21 AM

యూఏఈ రాజకుటుంబానికి చెందిన మహ్రా అల్ నహ్యాన్ లండన్‌లో స్పృహలేని స్థితిలో కనిపించారు. ఈ ఘటనలో చిన్నారి నిర్లక్ష్యానికి సంబంధించిన నేరాన్ని తాజాగా ఆమె అంగీకరించారు.

లండన్‌ వీధిలో స్పృహ కోల్పోయిన రాజకుటుంబ సభ్యురాలు.. కోర్టు చర్యలు.!
UAE Royal Mahrah Al Nahyan Passes Out On London Street

ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ రాజ కుటుంబంతో వైవాహిక సంబంధమున్న మహ్రా అల్‌ నహ్యాన్‌(32) లండన్‌లోని ఓ వీధిలో స్పృహ తప్పిపడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఆమె తాజాగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.


ప్రాసిక్యూషన్‌ వివరాల ప్రకారం.. గత జూన్‌ 13న వెస్ట్ లండన్‌లోని ఓ ఏరియాలో మహ్రా స్పృహలేని స్థితిలో కనిపించారు. ఆమె సమీపంలోనే మరో వ్యక్తి కూడా అపస్మారక స్థితిలో పడిఉన్నట్లు తెలుస్తోంది. ఆ పక్కనే ఓ మూడేళ్ల చిన్నారి కాళ్లకు చెప్పుల్లేకుండా, దిక్కుతోచని స్థితిలో ట్రాఫిక్ రోడ్డుకు సమీపంలో ఉంది. గమనించిన స్థానికులు వెంటనే ఆ చిన్నారిని చేరదీసి, పోలీసులకు సమాచారం అందించారు.

Mahra Al Nahyan.webp


ఈ ఘటనకు సంబంధించి సౌత్ లండన్‌లోని ఓ న్యాయస్థానంలో విచారణ జరగ్గా.. ఆ చిన్నారి విషయంలో నిర్లక్ష్యం వహించినట్టు అంగీకరించారు మహ్రా. అయితే.. ఆ రోజు ఆమె ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోలేదని, అంతకుముందు కొన్ని రోజులుగా అధిక మోతాదులో కొకైన్ తీసుకోవడంతోనే తీవ్ర అలసటకు గురయ్యారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తన తప్పిదంపై ఆమె పశ్చాత్తాపడుతున్నారని, ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకొంటున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం చివరకు నహ్యాన్‌ రెండేళ్లపాటు కమ్యూనిటీ పునరావాస కార్యక్రమంలో పాల్గొనాలని తీర్పు వెలువరించింది. దీంతో పాటు 6,114 పౌండ్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.


ఇవీ చదవండి:

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

వర్చువల్‌ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్‌

Updated Date - Oct 16 , 2026 | 11:34 AM