పుంగనూరులో కూటమి - వైసీపీ ఘర్షణలు.. పలువురికి గాయాలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:10 AM
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పుంగనూరులో అధికార కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి.
చిత్తూరు జిల్లా, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పుంగనూరులో అధికార కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. టీడీపీ కార్యకర్తపై మిథున్రెడ్డి సహా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మధుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో పలువురికి గాయాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.బెంగళూరు నుంచి రౌడీలను తీసుకువచ్చి తమపై దాడి చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఇరు శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లడంతో అడ్డుకునేందుకు కూటమి శ్రేణులు ప్రయత్నించాయి.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఇరు శ్రేణులను అక్కడి నుంచి దూరంగా పంపించివేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో ఘర్షణ..
మరోవైపు.. తిరుపతిలో నామినేషన్ కేంద్రం దగ్గర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని కూటమి పక్షాలు ఆందోళనకు దిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News