వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:20 AM
వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నిక వేళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.
అనంతపురం, అక్టోబర్ 16: వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నిక వేళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ నేత హాజీ బాషా.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 87 మున్సిపాలిటీలు/నగర పంచాయితీలు, 13 నగర పాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.
ఆయా జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. వైసీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోనూ నామినేషన్ల హడావిడి నెలకొంది. ఆయా పార్టీల నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. ఎన్నికల్లో గెలుపొందేందుకు కూటమి పార్టీల నేతలు, వైసీపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారంటూ పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
స్వీట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు.. 2,480 కిలోల ఆహార పదార్థాల సీజ్
హైదరాబాద్లో ఆపరేషన్ ‘కవచ్’.. పోలీసుల విస్తృత తనిఖీలు
Read Latest AP News And Telugu News