Share News

హైదరాబాద్‌లో ఆపరేషన్ ‘కవచ్’.. పోలీసుల విస్తృత తనిఖీలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 10:49 AM

హైదరాబాద్‌లో ఆపరేషన్ ‘కవచ్’ ఉత్కంఠ రేపుతోంది. నగరవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు నగరంలో భారీ భద్రతా ఆపరేషన్‌ను చేపట్టారు.

హైదరాబాద్‌లో ఆపరేషన్ ‘కవచ్’.. పోలీసుల విస్తృత తనిఖీలు
Hyderabad Police

హైదరాబాద్, అక్టోబర్ 16: భాగ్యనగరంలో ఆపరేషన్ ‘కవచ్’ ఉత్కంఠ రేపుతోంది. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు నగరంలో భారీ భద్రతా ఆపరేషన్‌ను చేపట్టారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతే ధ్యేయంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ కవచ్ కొనసాగుతోంది. నగరంలోని ప్రతి ప్రధాన కూడలి వద్ద పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.


పత్రాలు లేని, సరికాని నంబర్ ప్లేట్లు ఉన్న వందలాది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నగరంలో చోటుచేసుకున్న వరుస హత్యలు, నేరాల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నేరాల కట్టడి, రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆపరేషన్ కవచ్ చేపట్టారు. ప్రజల భద్రత కోసమే ప్రత్యేకంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మూలా నక్షత్రం వేళ.. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ..

స్వీట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు.. 2,480 కిలోల ఆహార పదార్థాల సీజ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 10:57 AM